కరోనా సృష్టించిన కల్లోలంతో అందరూ ఇంటికే  పరిమితమయ్యారు. జనాలకు కాలక్షేపం టీవీ లేదంటే ఫోన్. ఓటిటి సబ్ క్రిప్షన్ ఉంటే.. రోజుకు ఒకటి రెండు సినిమాలు లేపేస్తున్నారు. ఈ క్రమంలో రిలీజ్ కు రెడీ అయిన సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. నాని.. రామ్ ల సినిమాలు కూడా ఇందులో ఉన్నాయి. మరి వీళ్ల సినిమాలు బిగ్ స్క్రీన్ పై కనిపించకుండానే డిజిటల్ మార్కెట్ లో రిలీజ్ అవుతాయా.. !

 

కరోనా ప్రభావం మరింత కాలం ఉండే విధంగా కనిపిస్తోంది. ఒక వేళ లాక్ డౌన్ ఎత్తేసినా.. థియేటర్స్ లోకి జనాలు రావడానికి ఇష్టపడరు. రెండు మూడు నెలలు గడిచిన తర్వాతే థియేటర్స్ వైపు చూస్తారన్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మార్చి.. ఏప్రిల్ లో రావాల్సిన సినిమాలను డైరెక్ట్ లో ఓటిటి ప్లాట్ ఫారమ్ లో రిలీజ్ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

 

యంగ్ హీరోలు నటించిన సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయన్న వార్తకు శక్తి సినిమా  బలం చేకూర్చింది. శివకార్తికేయ తమిళ చిత్రం తెలుగులో శక్తి పేరుతో డబ్ అయింది. మార్చి 20న రావాల్సి ఉండగా.. అప్పటికే థియేటర్స్ మూసేశారు. దీంతో సినిమాను డిజిటల్ మీడియాలో రిలీజ్ చేసేశారు. దీంతో మరిన్ని సినిమాలు ఇలాగే వచ్చేస్తాయన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 

 

రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా ఓరేయ్ బుజ్జిగా. గుండెజారి గల్లంతయిందే ఫేం కొండా విజయ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి 25న రావాల్సి ఉంది. అయితే త్వరలో ఓటిటిలోకి వచ్చేస్తుందంటూ వచ్చిన వార్తను నిర్మాత ఖండించాల్సి వచ్చింది. 

 

రామ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ రెడ్ సినిమాను ఏప్రిల్ 9న రిలీజ్ చేద్దామనుకున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ ఈ మూవీని నిర్మించింది. ఓటీటీలో రిలీజ్ అవుతోందని వస్తున్న వార్తను ఖండిస్తూ.. రాామ్ ట్వీట్ చేశాడు. ముందు బిగ్ స్క్రీన్ లోనే రిలీజ్ అంటూ క్లారిటీ ఇచ్చాడు రామ్. 22కోట్లు ఇవ్వడానికి ఓ డిజిటల్ సంస్థ ముందుకొచ్చిందనీ.. లేటైనా.. ముందుగా.. థియేటర్స్ లో రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో నిర్మాత ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: