టాలీవుడ్ లో యంగ్ హీరోలకు కొదవ లేదు. వీరిలో నిఖిల్ సిద్దార్ధ్ కు ప్రత్యేక స్థానం ఉంది. హ్యాపీడేస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ స్టర్ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. సోలో హీరోగా చాలా సినిమాల్లో నటించినా స్వామి రారా, కార్తికేయ వంటి సినిమాలు నిఖిల్ ను టాలీవుడ్ లో నిలబెట్టాయి. ఆమధ్య కిరాక్ పార్టీలో నటించిన నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ2 సినిమాకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల సినిమా షూటింగ్ కు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా విషయంలో నిఖిల్ ఓ నిర్ణయం తీసుకున్నాడు.

 

 

ఇటివల ఓ మీడియా ఇంటరాక్షన్ లో నిఖిల్ కార్తికేయ2 గురించి తన అభిప్రాయాలు చెప్పాడు. ‘కార్తికేయ2 కు మంచి కథ సిద్ధమైంది. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమా స్కేల్ లో తీయాలని అనుకోవటం లేదు. కానీ.. ఈ సినిమాను సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఆర్ఆర్ఆర్ కు ఎన్టీఆర్ అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పినట్టు నేను కూడా కార్తికేయ2 కు అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాలని చూస్తున్నా’ అని అన్నాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అయింది. ఎన్టీఆర్ ఇన్సిపిరేషన్ గా కార్తికేయ తీసుకున్న నిర్ణయం మరి ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

 

 

కెరీర్ పరంగా కార్తికేయ2 తో పాటు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18పేజెస్ సినిమా చేయబోతున్నాడు. పర్సనల్ లైఫ్ లో నిఖిల్ కు పెళ్లి కూడా ఫిక్స్ అయింది. కరోనా ప్రభావానికి సినిమాతో పాటు పెళ్లి కూడా వాయిదా పడింది. కరోనా పరిస్థితుల్లో నిఖిల్ తనదైన స్టైల్లో చారిటీ చేస్తున్నాడు. గాంధీ హాస్పిటల్లో డాక్టర్ల కోసం మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసి తన వంతు బాధ్యత నెరవేర్చాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: