ఒక్క విషయంలో మాత్రం సురేంద్రరెడ్డి రాజమౌళిని ఫాలో అవుతాడు. రాజమౌళి సినిమా కథల వెనకాల ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ ఉంటే.. సురేంద్ర రెడ్డి వెనకాల వక్కంతం వంశీ ఉన్నాడు. అయితే ఈ సెంటిమెంట్ బ్రేక్ చేస్తున్నాడు సురేంద్రరెడ్డి. ఈ సారి సొంత కథతో వస్తున్నాాడట. కరోనా హాలిడేస్ కలిసిరావడంతో.. మైండ్ కు పదునుపెట్టి.. కథ రాసుకునే పనిలో ఉన్నాడు సురేంద్ర రెడ్డి. 

 

సురేంద్రరెడ్డి కెరీర్ 2005లో అతనొక్కడే అనే సినిమాతో మొదలైంది. ఈ 15ఏళ్లలో తొమ్మిది సినిమాలు డైరెక్ట్ చేశాడు. డెబ్యూ మూవీ అతనొక్కడేను సొంత కథతో తెరకెక్కించగా.. మిగిలిన 8 సినిమాల కోసం రైటర్స్ పై ఆధారపడ్డాడు సురేంద్రరెడ్డి. అతనొక్కడే.. సైరా.. ధృవ మినహా ఆరు సినిమాలకు వక్కంతం వంశీ కథ అందించాడు. 

 

చిరంజీవితో తీసిన సైరా.. సురేంద్ర రెడ్డి కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. దర్శకుడు తన కెరీర్ ఫస్ట్ టైమ్ భారీ గ్రాఫిక్స్ తో ఈ హిస్టారికల్ మూవీని రూపొందించాడు. ఇలాంటి జానర్ టచ్ చేయడం మొదటి సారే అయినా.. బాగానే తీశాడన్న పేరు తెచ్చుకున్నాడు. సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా.. సురేంద్రరెడ్డి డైరెక్షన్ కు మంచి మార్కులే పడ్డాయి. సినిమా రిలీజై ఆరు నెలలు దాటినా.. తర్వాతి ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేయలేదు. స్టార్ హీరోలు ఎవరికి వాళ్లు కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ఒకరిద్దరు హీరోల పేర్లు  బయటికొచ్చినా.. వర్కవుట్ కాలేదు. 

 

అతనొక్కడే తర్వాత సొంత కథల జోలికి వెళ్లని సురేంద్రరెడ్డి ఈ సారి ఓన్ స్టోరీతో వస్తున్నాడు. రేసుగుర్రం హిట్ తర్వాత బన్నీ, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో మరో మూవీ రాలేదు. వచ్చే ఏడాది ఈ హిట్ కాంబినేషన్ ఉంటుందట. ఈ లోగా అఖిల్ తో మూవీ ప్లాన్  చేస్తున్నాడన్న వార్తలొస్తున్నాయి. మరి ఏ సినిమాకు సొంత కథ ఇస్తాడోగానీ.. కరోనా హాలిడేస్ ను వేస్ట్ చేయకుండా.. కథ రాసుకుంటున్నాడు సురేంద్రరెడ్డి. 

మరింత సమాచారం తెలుసుకోండి: