బాలయ్య అంటేనే పక్కా మాస్. ఆయన హీరోయిజం వెండి తెర మీద వెలిగిపోతుంది. ఆయన వచ్చాడంటేనే విలన్లు అలా వెళ్ళి ఎక్కడో పడుతూ ఉంటారు. ఇక సుమోలు పైకి లేస్తాయి. అలాగే రైళ్ళు ఆగిపోతాయి. ఎంటటి బీభత్సం  చేయాలో అంతా జరిగిపోతుంది.

 

మరి బాలాయ్య మూవీలో మరోటి కూడా ఉంది. అదే డైలాగులు. బాలయ్య సినిమాలకు భారీ  డైలాగులు ప్రాణం. గుక్క తిప్పుకోకుండా బాలయ్య డైలాగులు చెబుతూంటే విని ఆనందించడం ఫ్యాన్స్ వంతు. వాటిని పదే పదే చెప్పుకుని మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచుతారు.

 

అటువంటి బాలయ్య సినిమాలో ఫైట్లు ఉండవు, డైలాగులు ఉండవంటే ఫ్యాన్స్ కి భారీ షాకే మరి. ఈ రెండే బాలయ్య మూవీని హైలెట్ చేస్తాయి. మరి ఇవే లేకపోతే ఎలా అన్నది ఇపుడు పెద్ద ప్రశ్న. కానీ బాలయ్య,బోయపాటిల హ్యాట్రిక్ మూవీలో మాత్రం ఇవి లేవు అంటున్నారు. నిజంగా లేకపోతే మాత్రం అది పెద్ద ఇబ్బందే. 

 

కానీ ఈ మూవీ డివోషనల్, అండ్ ఎమోషనల్  స్టోరీగా సాగుతుందని టాక్. ఈ మూవీలో ఆధ్యాత్మికమైన ఓ పాత్రలో  బాలయ్య అఘోరా గా కనిపిస్తాడట. ఇక మరో పాత్ర ఉంటుంది కానీ ఆ పాత్ర ఎమోషనల్ గా సాగుతుందిట. అందుకే ఫైట్లు,  డైలాగులు ఉండవు అని ఇన్సైడ్ టాక్.

 

చూడాలి బోయపాటి వంటి పక్కా మాస్  డైరెక్టర్, బాలయ్య వంటి మాస్ హీరో కలిస్తే ఉండాల్సిన రసాలు లేకపోతే ఆ మూవీ మరెలా డిజైన్ చేస్తారో, అభిమానులను ఎలా అలరిస్తారో. ఏది ఏమైనా ఈ  మూవీ విషయంలో ఎన్నో అంచనాలు ఉన్నాయి.  అయితే హీరోయిన్ల కొరతకు తోడు బడ్జెట్ సైజ్ తగ్గించేయడం, ఇపుడు ఫైట్లు, డైలాగులు ఉండవంటూ లీకులు రావడంతో  ఫ్యాన్స్ నీరసంగా ఉంటున్నారు.  హ్యాట్రిక్ మ్యాజిక్ ఎలా ఉంటుందో మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: