అల్లు అర్జున్సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప‌' సినిమా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'పుష్ప' పోస్టర్ చూస్తే లెక్కల మాస్టర్ సుకుమార్ మరో ప్రయోగానికి తెరలేపాడని ఇట్టే అర్ధమైపోతుంది. రాయలసీమ చిత్తూరు యాస, భాషతో పాటు బన్నీ ఊరమాసు మొరటు కుర్రాడిగా ఇరగదీస్తాడనిపిస్తుంది. అంతేకాకుండా సుకుమార్-రామ్ చరణ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' ఛాయలు కూడా 'పుష్ప'లో కనిపిస్తున్నాయి. ఆలాగే బన్నీ డ్రెస్సింగ్ స్టైల్, గెటప్ కూడా రంగస్థలంలో రామ్ చరణ్ ని పోలివుంది. శేషాచ‌లం అడ‌వుల్లో గంధపు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

 

బన్నీ లుక్ బయటికి వచ్చాక ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక ఎలా కనిపించబోతోంది అనే ఆసక్తి ప్రేక్షకులలో పెరిగిపోయింది. ఆమె పుష్ప రాజ్ ప్రియురాలిగా పల్లెటూరి అమ్మాయిగా కనిపించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఫారెస్ట్ నేపథ్యంలో జరిగే స్టోరీ కావడంతో లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ అయినా అయ్యివుండొచ్చు. ఒకవేళ రష్మిక పల్లెటూరి పిల్లగా కనిపించాల్సి వస్తే మాత్రం రంగస్థలంలో రామలక్ష్మిని తలపించడం ఖాయం అంటున్నారు. రంగస్థలంలో రామలక్ష్మి పాత్రలో సమంత ఇరగదీసిందని చెప్పవచ్చు. బన్నీ లుక్ ని బట్టి అంచనా వేస్తే రష్మిక లుక్ రంగస్థలంలో సమంత లుక్ ని పోలివుండే అవకాశాలు ఉన్నాయి. ఇదే కనుక నిజమైతే రష్మిక కెరీర్లో గుర్తుండిపోయే క్యారక్టర్ గా ఇది మిగిలిపోనుంది. మరి రష్మిక పాత్ర గురించి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: