కరోనా వైరస్ వల్ల చాలామంది సెలబ్రిటీలు ప్రజలకు రకరకాలుగా సహాయం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయితే ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తూ మరోపక్క పేదవాళ్ల అవసరతలు తీరుస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో...అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో సెలబ్రిటీలు అంతా సోషల్ మీడియాలో తమ ఆలోచనలు అభిప్రాయాలను తెలియజేస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్ పోరాటంలో చిరంజీవి తల్లి అంజనాదేవి భాగమయ్యారు అని గత మూడు రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి ఏడు వందల మార్కులు కుట్టి అవసరమైన వారికి అందజేస్తున్నారనే కథనం ఒక్కటి ఈరోజు సాక్షి పేపర్ లో వచ్చింది.

 

సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అనే పేరు పై ఉన్న ప్రొఫైల్ ద్వారా ఈ వార్త రావడంతో...సదరు జర్నలిస్టు ఏమి ఆలోచించకుండా సాక్షి పేపర్లో వేసాడు. అయితే వచ్చిన వార్త స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వివరణ ఇచ్చారు. వచ్చిన కథనం లో ఉన్నది తన తల్లి కాదని...ఇటువంటి ఆపత్కాల టైంలో ఆమె చేస్తున్న పనికి ఎంతో ముగ్ధుడినయ్యానని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

 

‘‘మా అమ్మగారు మాస్క్‌లు తయారుచేస్తున్నారనే వార్తలు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం చూశాను. ఆ మీడియా కథనంలో ఉన్నది మా అమ్మగారు కాదని వినయంగా తెలియజేస్తున్నాను. కానీ ఎవరైతే ఈ కథనంలో ఉన్నారో ఆ తల్లికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే..’’ అని మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో తెలిపారు. దీంతో చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారని, ఇటువంటి వార్తలకు చెక్ పెట్టడం లో  పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అడుగు పెట్టారు అని అభిమానులు అంటున్నారు.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple.

 

మరింత సమాచారం తెలుసుకోండి: