టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బహుబలి రెండు భాగాల అద్భుత విజయాలతో ఇండియా మొత్తంలో కూడా విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ తో పాటు భారీ లెవెల్లో తన మార్కెట్ ని పెంచేసుకున్నాడు. ఇక ఆ తరువాత యువి క్రియేషన్స్ బ్యానర్ పై యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమా రిలీజ్ తరువాత ప్రభాస్ క్రేజ్ మరింతగా పెరిగిందనే చెప్పాలి. వాస్తవానికి తెలుగు సహా పలు ఇతర భాషల్లో ఎంతో భారీగా రిలీజ్ అయిన ఆ సినిమా, నార్త్ లో మాత్రం మరింత అత్యద్భుతమైన విజయాన్ని అందుకుని మన ప్రభాస్ రేంజ్ ని అక్కడ మరొక్కసారి రుజువు చేసింది. 

 

ఇక ప్రస్తుతం జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్ సినిమా చేస్తున్న ప్రభాస్, ఎలాగైనా ఆ సినిమాతో మంచి హిట్ కొట్టాలని మంచి కసితో పనిచేస్తున్నట్లు సమాచారం. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో రిట్రో ప్రేమకథగా ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ కలిగి ఉన్న ప్రభాస్, ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ ద్వారా తన సినిమా, వ్యక్తిగత విషయాలను గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. 

 

ఇకపోతే నేటితో ఇన్స్టాగ్రమ్ లో 1 మిలియన్ హాష్ ట్యాగ్ పోస్టులు కలిగిన ఏకైక టాలీవుడ్ హీరోగా ప్రభాస్ ఒక సెన్సేషనల్ రికార్డుని సొతం చేసుకున్నారు. నిజానికి ఒక తెలుగు హీరోకి 1 మిలియన్ హాష్ ట్యాగ్స్ రావడం కష్టం అని, కాగా అంతకముందు 824కె హాష్ ట్యాగ్స్ తో అల్లు అర్జున్, అలానే 684కె హాష్ ట్యాగ్స్ తో సూపర్ స్టార్ మహేష్ మొదటి రెండు స్థానాల్లో నిలవగా, నేడు ప్రభాస్ వారందరినీ అధిగమించి 1 మిలియన్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారని అంటున్నారు. దానితో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా దానిని ఒక పెద్ద ట్రెండ్ గా సెట్ చేసి ట్విట్టర్ లో ఆ ట్రెండ్ ని ప్రస్తుతం పరిగెత్తిస్తున్నారు మన డార్లింగ్ ఫ్యాన్స్....!!

మరింత సమాచారం తెలుసుకోండి: