ఈ ఏడాది అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంబులో’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం అందరికీ తెలిసినదే. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ ఇచ్చి త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. బన్నీ కెరీర్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డును సృష్టించింది. ఇటువంటి తరుణంలో తర్వాత సినిమా ని సుకుమార్ తో ఓకే చేసిన బన్నీ..తాజాగా తన పుట్టినరోజు నాడు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ‘పుష్ప’ టైటిల్ పేరిట రిలీజైన ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

 

ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారనున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో కాబట్టి చాలా డిఫరెంట్ గా సినిమా చూపిస్తున్నాడు అని బన్నీ ఫస్ట్ లుక్ లో చూస్తున్న విధానం బట్టి తెలిసిపోతుంది. అయిదు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా నీ అన్ని భాషల్లో ఆదరణ దక్కే విధంగా అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సినిమాల్లో ఎక్కువగా పాన్ ఇండియా గుర్తింపు ఉన్న స్టార్స్ ని ఫైనలైజ్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

 

తాజాగా బాలీవుడ్ పరంగా హిందీలో స్టార్ అయిన సునీల్ శెట్టితో విలన్ పాత్ర కోసం చర్చలు జరుపుతున్నారు. సినిమాలో సునీల్ శెట్టి విలన్ గా ఓకే అయితే పుష్ప సినిమా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు. విలన్ దెబ్బకి ఇండియాలో బన్నీ రికార్డు కొట్టే చాన్స్ ఉందని టాక్ వినపడుతుంది. సునీల్ శెట్టి ఇప్పటికే సౌత్ లో భారీ ప్రాజెక్టులలో నటించడం జరిగింది. దీంతో సినిమాలో సునీల్ శెట్టి విలన్ గా ఓకే అయితే మాత్రం… బన్నీకి చాలా బాగుంటుందని సినిమా విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: