కరోనా.... పేరు వింటేనే ప్రపంచం మొత్తం భయభ్రాంతులకు గురి అవుతున్న వేళ ఒక తెలుగు కుటుంబం గుండె నిబ్బరంతో మరియు అశేషమైన ధైర్యంతో కరోనా వైరస్ పై విజయం సాధించిన తీరు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఎక్కడో దేశం కాని దేశంలో ఉంటూ ఇంటి వైద్యం తోనే కరోనా ని మట్టి కరిపించి తమ శరీరాల్లో నుండి తరిమేశారు. ఇప్పుడు భార్యాభర్తలిద్దరి విజయగాథ ప్రపంచం మొత్తానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఇంటిలో ఉంటూనే వైరస్ సోకిన భార్యాభర్తలు ఇద్దరూ తమ కుమార్తెలకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్న తీరు నిజంగా ప్రశంసనీయం.

 

 

నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని రణంపల్లికి చెందిన నిమ్మగడ్డ శేషగిరి రావు కాకినాడలో వైద్య విద్యను పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లారు. అక్కడే చదువు అయిపోయిన తర్వాత మానసిక వైద్యుడిగా స్థిరపడిన ఆయన హేమ అనే ఆమెను పెళ్లాడాడు. వీరిద్దరికీ 12 ఏళ్ల వయసున్న కవల కూతుర్లు ఉన్నారు. ఎంతో సజావుగా సాగుతున్న వీరి జీవితం లోకి కరోనా మహమ్మారి ప్రవేశించింది. మార్చి 13 పిల్లలను బడి నుండి తీసుకుని రావడానికి వెళ్ళిన హేమకు వైరస్ సోకింది. స్వతహాగా వైద్యుడైన శేషగిరిరావు తన సతీమణికి కరోనా సోకిందని నిర్ధారించాడు. మాత్రం భయపడకుండా ఆమెకు ఇంటిలోనే చికిత్స మొదలు పెట్టిన ఆయన అదే క్రమంలో వైరస్ తనకు కూడా సోకిందని గ్రహించాడు.

 

పిల్లలిద్దరినీ ఒకే గదిలో ఉంచి.... వీరు మరొక గదిలో సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లి పోయారు. కరోనా కారణంగా ఇద్దరికీ రోజూ జ్వరం వచ్చేది. అంతేకాకుండా దగ్గు కూడా వచ్చేది. జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్ వేసుకోవడం స్టార్ట్ చేసిన నిమ్మగడ్డ... దగ్గు తగ్గేందుకు సిరప్ తాగేవారు. క్రమంలో కరోనా సోకిందన్న ఆందోళనను పక్కనపెట్టేసిన నిమ్మగడ్డ దంపతులు... పారాసిటమాల్ తో పాటు రోజూ ఉప్పు నీళ్లు వీలయినంత ఎక్కువ తాగడం - పసుపు - అల్లం - మిరియాల పొడి వేసిన నీటిని మరిగించుకుని తాగడం నిమ్మరసం తాగడం.. ఒంట్లో శక్తి తగ్గకుండా ఏదో ఒకటి తినడం... ఇలా కరోనాపై పోరు సాగించారు.

 

వారి పిల్లల చేత ఏదో వారికి చేతనైనంతలో వంటలు చెప్పి చేయించిన వారి అలుపెరుగని పోరాటానికి.... ఆ కుటుంబం మొక్కవోని ధైర్యం ముందు కరోనా తల వంచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: