మన భారతదేశంలో అత్యధికంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. దేశం వ్యాప్తంగా లాక్ డౌన్ విధించినా కూడా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుదలలో ఎటువంటి మార్పు లేదు. ప్రతిరోజు అనూహ్యంగా వందలాది కేసులు బయటపడుతూ ఉండగా ఇప్పటికే వాటి సంఖ్య రెండు వేలకు చేరువయ్యింది. ముఖ్యంగా ఆర్థిక రాజధాని ముంబై నగరంలో అయితే ఏకంగా వెయ్యి కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఒక్కోరోజు ఒక్కోచోట పదుల సంఖ్యలో కేసులు బయటపడడం ఇపుడు ప్రజల్లో కలవరం రేపుతోంది.

 

ఇక ఇప్పుడు అందరినీ భయపెడుతున్న విషయం ఏమిటంటే ముంబై లోని ప్రతిష్టాత్మకమైన తాజ్ హోటల్ లో కరోనా పంజా విసిరిందని సమాచారం. ఎప్పుడూ విఐపి లు ఉండే ఫైవ్ స్టార్ హోటల్ లో 500 మందికి పైగా హోటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందట. వార్త ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం గుండెల్లో గుబులు రేపుతోంది. ఏకంగా ఐదు వందల కేసులు ఒకేసారి వెలుగులోకి రావడం ఇంకా వారి నుండి హోటల్ కి వచ్చిన వారికి ఎంత మందికి వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కలవరపడుతోంది.

 

ముంబై లబాలో ని తాజ్ మహల్ ప్యాలెస్, తాజ్ మహల్ టవర్స్ లో పనిచేసే 500 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారంతా ఇప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నారని అసలు ఒక్కసారిగా వారికి ఎలా వైరస్ సోకిందో తెలియట్లేదని హోటల్ యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం హోటల్ ఖాళీగా ఉంది. అద్దెకు ఎవరికీ ఇవ్వడం లేదు. వేడుకలు రద్దు చేశారు. ఈక్రమంలో కేవలం హౌస్ కీపింగ్ తో పాటు సెక్యూరిటీ - నిర్వహణ సిబ్బంది మాత్రమే ఉన్నారు. కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడంతో హోటల్ అప్రమత్తమైంది. సందర్భంగా కరోనా సోకిన వారిని ఆస్పత్రికి - మరికొందరిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: