ఆరెక్స్ 100 అనే ఒక్క సినిమాతోనా 10 సినిమాల క్రేజ్ తెచ్చుకుంది బాలీవుడ్ భామ పాయల్ రాజ్ పుత్. ఎక్కడో బాలీవుడ్ లో సీరియల్ నటిగా ఉన్న ఆమెను తెచ్చి టాలీవుడ్ లో హాట్ భామగా పాపులారిటీ వచ్చేలా చేశాడు డైరక్టర్ అజయ్ భూపతి. ఆరెక్స్ 100 సినిమాలో ఆమె అందంతో పాటుగా నటనకు అందరు ఫిదా అయ్యారు. ఓ విధంగా మొదటి సినిమానే సాహసం చేసింది పాయల్ అందుకే ట్లేడుగులో వరుస ఛాన్సులు అందుకుంటుంది. 

 

మొదటి సినిమా బోల్డ్ గా చేయడంతో తనకు అలాంటి ఆఫర్లే వస్తున్నాయంటూ వాపోయింది. లాక్ డౌన్ టైం లో ఇంట్లో తెగ కష్టపడుతుంది పాయల్ రాజ్ పుత్. మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలని చెబుతూ ఇంటిని శుభ్రం చేస్తున్న వీడియోలను పెట్టింది. అయితే వితౌట్ మేకప్.. విత్ మేకప్ ఇలా రెండు ఫోటోలు పక్క పక్కనే పెట్టి ఇది జీవితం అంటూ కామెంట్ పెట్టింది. మేకప్ తో ఉన్న పిక్ లో అందంగా ఉన్న పాయల్ మేకప్ లేకుండా ఇంటిని శుభ్రం చేస్తూ కూడా బాగానే ఉంది. 

 

అయితే ఇదే జీవితం అంటూ చెప్పడానికి ప్రయత్నించినా పాయల్ కు నెటిజెన్ల నుండి మంచి కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు ఆమెను అమితంగా ప్రేమించే అభిమానులు నువ్వలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్వారెంటైన్ టైం లో ఇంట్లోనే ఉంటూ తనలో ఉన్న అన్ని యాంగిల్స్ చూపిస్తుంది పాయల్. వెంకీ మామతో హిట్ అందుకున్నా రవితేజతో చేసిన డిస్కో రాజా ఫ్లాప్ అవడంతో కెరియర్ లో కొద్దిగా వెనుకపడ్డది. మళ్ళీ మంచి అవకాశం చూస్తున్న పాయల్ ప్రస్తుతం రెండు మూడు కథలు వింటున్నట్టు తెలుస్తుంది.  మళ్ళీ ఒక సినిమా ఆరెక్స్ 100 రేంజ్ హిట్ అయితే పాయల్ క్రేజ్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. అలంటి ఛాన్స్ కోసమే అమ్మడు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: