ప్రస్థుతం ప్రపంచ జనాభాలో 70 శాతం పై చిలుకు కరోనా భయాలతో స్వీయ గృహ నిర్భంధంలో కాలం గడుపుతూ కరోనాతో యుద్ధం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం సెలెబ్రెటీ లకు ఖాళీ ఎక్కువగా దొరకడంతో తమలోని క్రియేటివిటీని బయటకు తీసి రకరకాల ఛాలెంజ్ లు విసురుతూ జనం మధ్య పాపులర్ అవ్వడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

అనేకమంది గాయకులు కవులు కలిసి కరోనా పై అనేక ప్రైవేటు సాంగ్స్ విడుదల చేస్తుంటే హీరోలు తమ చేతనైన రీతిలో సామాజిక కార్యక్రమాలలో బిజీగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో మన గ్లామర్ బ్యూటీల దృష్టి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ‘క్వారెంటైన్ పిల్లో ఛాలెంజ్’ పై పడింది. 

 

ప్రస్తుతం ఈ ఛాలెంజ్ లు ప్రపంచ వ్యాప్తంగా ఇన్ స్టా గ్రామ్  ట్విటర్ వేదికగా ఈ ఛాలెంజ్ లను రష్యా లోని గ్లామర్ బ్యూటీలు మొదలు పెడితే ఆ తరువాత ఈ ట్రెండ్ హాలీవుడ్ ను తాకి ఇప్పుడు బాలీవుడ్ ద్వారా ఇండియాలో ఎంటర్ అయింది. ఈ ‘క్వారెంటైన్ పిల్లో ఛాలెంజ్’ లో పాల్గొనే బ్యూటీలు బట్టలు లేకుండా కేవలం పిల్లోలను మాత్రం అడ్డు పెట్టుకుని ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ ఫోటో షూట్స్ ఇస్తారు. 

 

ఈ ట్రెండ్ ను కనిపెట్టిన బెంగాలి బ్యూటీ డెబినా బెనర్జీ ఒక హాట్ పిల్లో ఫోటో షూట్ ఇచ్చి ఇలాంటి ఫోటో షూట్ చేయగలవా అంటూ ఆమె చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ కు సవాల్ విసిరింది. దీనితో ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ ఇప్పుడు ఈ క్వారెంటైన్ పిల్లో ఛాలెంజ్ ని ఒక సవాల్ గా తీసుకుంటూ ఈ కరోనా స్వీయ గృహ నిర్భంద సమయాన్ని వినియోగించుకుంటూ తమ క్రేజ్ ని పెంచు కోవడానికి అప్పడే ప్రయత్నాలు మొదలుపెట్టేసారు. ఇప్పుడు ఈ ట్రెండ్ మన దక్షిణాది హీరోయిన్స్ వరకు ప్రాకితే ప్రస్తుతం బాగా ఖాళీగా సమయం గడుపుతున్న యూత్ కు మంచి స్పైసీ ఫోటోలను చూసి ఆనందించే అవకాసం కరోనా కలిగిస్తోంది అనుకోవాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: