పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ వచ్చేనెల మేలో విడుదల చేయాలని దిల్ రాజ్ భారీ స్కెచ్ వేసుకుని ఈమూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అయితే కరోనా కల్లోలంతో ఈమూవీ షూటింగ్ ఆగిపోవడంతో ఆగష్టు నెలలో విడుదలైతే చాల అదృష్టమే అని అంటున్నారు. 

 

దీనితో తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయిన పవన్ అభిమానులకు ఈమూవీకి దిల్ రాజ్ తో పాటు సహనిర్మాతగా వ్యవహరిస్తున్న బోనీ కపూర్ ఈమధ్య ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు కలవరం కలిగిస్తున్నాయి. బోనీ కపూర్ బాలీవుడ్ లో తిరుగులేని అగ్రనిర్మాతగా వెలిగేరోజులలో అతడు తీసిన ‘రూప్ కి రాణీ చోరాన్ కా రాజా’ మూవీతో నిర్మాతగా విపరీతమైన నష్టాలు వచ్చి పీకలలోతు కష్టాలలోకి వెళ్ళిపోయాడు. 

 

1993 లో విడుదలైన ఈభారీ మూవీని అప్పట్లో 10 కోట్ల భారీ బడ్జెట్ తో  శ్రీదేవి అనీల్ కపూర్ అనుపమ్ ఖేర్ పరేష్ రావల్  జాకీష్రాప్ రామ్ సేథీ వంటి పెద్ద తారాగణంతో  అప్పట్లో విడుదల అయితే ఆమూవీ భారీ ఫ్లాప్ గా మారడంతో ఆరోజులలోనే బోనీ కపూర్ కు కోట్లరూపాయలలో భారీ నష్టాలు రావడంతో అప్పటి నుండే బోనీ కపూర్ కు కష్టాలు ప్రారంభం అయ్యాయి అని అంటారు. 

 

ఈసినిమా విడుదలై ఇప్పటికి 27 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒకమీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన బోనీ కపూర్ ఇప్పటికీ తనకు ఆసినిమా పేరు చెపితే ఒక పీడకల లా ఉంటుందని ఇప్పుడు ఆమూవీని తనకు గుర్తు చేయవద్దు అంటూ ఆమీడియా ఇంటర్వ్యూలో తన ఆవేదనను వ్యక్తపరుచుకున్నాడు. ఇప్పుడు బోనీ కపూర్ కు అలనాటి చేదుజ్ఞాపకాలను మిగిల్చిన ఆమూవీ గురించి ఇప్పుడు అతడు గుర్తుకు చేసుకున్న నేపధ్యంలో ఇప్పుడు అలాంటి నెగిటివ్ సెంటిమెంట్ ‘వకీల్ సాబ్’ ను కూడ వెంటాడుతుందా అంటూ పవన్ అభిమానులు భయపడిపోతున్నారు. దీనికికారణం దిల్ రాజ్ తో కలిసి బోనీ కపూర్ ‘వకీల్ సాబ్’ ను నిర్మిస్తున్న పరిస్థితులలో బోనీ కపూర్ నోటివెంట అలనాటి ఆర్ధిక సమస్యలు ఎందుకు గుర్తుకు వచ్చాయి అంటూ పవన్ అభిమానులు బోనీ కపూర్ కామెంట్స్ ను వేరే కోణంలో చూస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: