టాలీవుడ్ లో ఇప్పుడు కరోనా కారణంగా ఏ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్ళే పరిస్థితి లేదు అనే విషయం అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. ఎలాంటి సినిమా అయినా సరే కరోనా తగ్గిన తర్వాత షూట్ చేయడమే గాని ఇప్పుడు మొదలు పెట్టే అవకాశాలు అనేవి దాదాపుగా లేవు అనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఇప్పుడు చాలా మంది నిర్మాతలు ఇప్పుడు పెట్టుబడులు పెట్టి సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. కాని ఈ తరుణంలో కరోనా వైరస్ కొట్టిన దెబ్బ వారిని బాగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది హీరోలు కూడా నష్టపోయారు ఇప్పుడు. 

 

ఇక వీరిలో అగ్ర హీరోలు అయితే సినిమానే నష్టపోయారు. ఒక్కో సినిమాను వాళ్ళు కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఏడాది ఆచార్య సహా రెండు మూడు పెద్ద హీరోల సినిమాలను విడుదల చెయ్యాలి అని భావించారు. కాని కరోనా ప్రభావం తో అది వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆయన లో అసహనం పెరిగింది అంటున్నారు. చిరంజీవి ఈ ఏడాది ఆచార్య సినిమాను పూర్తి చేసి లూసిఫర్ సినిమాను మొదలు పెట్టే ఆలోచన చేసారు. కాని కొన్ని కారణాలతో ఆచార్య సినిమా వాయిదా పడింది. 

 

ఇదిలా ఉంటే రామ్ చరణ్ పాత్ర ఈ సినిమాలో ఉంటుంది. ఆ పాత్ర షూటింగ్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. ఆ పాత్ర కు రామ్ చరణ్ వచ్చి షూటింగ్ చెయ్యాలి అంటే అతను చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను వాయిదా వెయ్యాలి. రామ్ చరణ్ పాత్రకు సంబంధించి దాదాపు 20 రోజుల మేర షూటింగ్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే రామ్ చరణ్ ఆలోచిస్తున్నాడు. దానికి రాజమౌళి కూడా ఓకే చెప్పలేదు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: