టాలీవుడ్ లో ఇప్పుడు రామ్ చరణ్ హవా నడుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా పోస్టర్ తర్వాత రామ్ చరణ్ పాత్ర ఆ సినిమాలో ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొన్న తరుణంలో పుట్టిన రోజు కి అతని పాత్రను రాజమౌళి రివీల్ చేసిన తీరు ఆ వచ్చిన ప్రోమో ఒక స్థాయిలో ఉన్నాయి. అక్కడి నుంచి రామ్ చరణ్ పాత్ర ఆర్ఆర్ఆర్ లో ఏ విధంగా ఉంటుంది, అతను ఎలా నటించే అవకాశం ఉంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే రామ్ చరణ్... 

 

ఇప్పుడు చేసే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అతను తర్వాత సుకుమార్ తో సినిమా చేస్తాడు అని అన్నారు. కాని కొత్త దర్శకుడు తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. కథ కూడా దాదాపుగా రెడీ గా ఉందని టాలీవుడ్ లో టాక్. అయితే సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అవ్వడం తో ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ ఒక పెద్ద సినిమాను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఆ సినిమాలో చిరంజీవి కూడా నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. 

 

రామ్ చరణ్ తాను హీరోగా కాకుండా ఎన్టీఆర్ ని ఉంచి ఇంకో సినిమా భారీగా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడని టాలీవుడ్ లో టాక్. కథ రెడీ గా ఉందని... ఆ కథను కూడా త్రివిక్రమ్ ఇచ్చాడని కమర్షియల్ గానే కాదు భారీ యాక్షన్ సినిమా ఇది అని అంటున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది చివరి నుంచి మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: