వెండితెర మీద నటించే వారికి ఎంత పాపులారిటీ ఉంటుందో దానికి ఏమాత్రం తక్కువ కాకుండా బుల్లితెర మీద కనిపించే వారికి కూడా ఉంది. ఒక్కోసారి బుల్లితెర మీద కనిపించే నటులకే పాపులరిటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే చాలా మంది వెండితెర మీద అవకాశాలు సన్నగిల్లుతున్నట్లు అనిపించగానే వెంటనే బుల్లితెరకి వచ్చేస్తున్నారు. అయితే తెలుగులో చాలా మంది హీరోలు బుల్లితెర మీద సందడి చేశారు. 

 

అందరిలోకి అందర్నీ బాగా ఆకర్షించింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. బిగ్ బాస్ మొదటి సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆ షో హిట్ అవడంలో ప్రముఖ పాత్ర వహించాడు. బిగ్ బాస్ మొదటి సీజన్ టీఆర్పీ రేటింగ్ లో టాప్ లో నిలిచింది. ఎన్టీఆర్ ఆ షోని నడిపించిన తీరు అందరికీ బాగా నచ్చింది. తనదైన పంచులతో నవ్వులు చిందిస్తూ ఆసక్తికరంగా నడిపాడు. 

 

మొత్తం మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో నాలుగవ సీజన్ కి రెడీ అవబోతుంది. మొదటి సీజలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎన్టీఆర్ ని మళ్ళీ బుల్లితెర మీద చూడబోతున్నాం. లాక్డౌన్ కారణంగా జనాలంతా ఇళ్లకే పరిమితం కావడంతో స్టార్ మా యాజమాన్యం మొదటి సీజన్ బిగ్ బాస్ ని మళ్లీ టెలిక్యాస్ట్ చేస్తుంది. సినిమా షూటింగులు, టీవీ ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ అవడంతో ఆల్రెడీ ప్రసారమైన ప్రోగ్రామ్స్ నే మళ్లీ వేస్తున్నారు.

 

అందుకని మొదటి సీజన్ పూర్తయి చాలా రోజులు అవుతుంది కాబట్టి, మళ్ళీ ఆ రోజులని గుర్తు చేయడానికా అన్నట్టు మొదటి సీజన్ ని టెలిక్యాస్త్ చేస్తుంది. ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు - మళ్లీ రాత్రి 10 గంటలకు ఈ షో స్టార్ మాలో ప్రసారం అవుతుంది. అప్పుడు మిస్సయి చూడలేకపోయామే అనుకున్న వాళ్ళు ఎలాగూ ఇంటిపట్టునే ఉంటారు కాబట్టి ఇప్పుడు చూసి ఆనందించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: