సౌత్ ఇండియా సినిమా ఇండ‌స్ట్రీలో దాదాపుగా 15 సంవ‌త్స‌రాలుగా తిరుగులేని హీరోయిన్‌గా వెలుగొందుతోన్న న‌య‌న‌తార ప్రేమాయ‌ణాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టి రెండుసార్లు ప్రేమ‌లో విఫ‌ల‌మైన న‌య‌న్ ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి ప్రేమ‌లో ఉంది. ముందుగా కోలీవుడ్ యంగ్ హీరో శింబుతో ప్రేమ‌లో ప‌డిన న‌య‌న్ ఆ త‌ర్వాత డ్యాన్స్ మాస్ట‌ర్ ప్ర‌భుదేవాతో ప్రేమ‌లో ప‌డ‌డం.. చివ‌ర‌కు వీరు పెళ్లి చేసుకుంటార‌నే వ‌ర‌కు వెళ్లి వీరి ప్రేమ బ్రేక‌ప్ అవ్వ‌డం జ‌రిగిపోయాయి. 

 

త‌న తొలి రెండు ప్రేమ‌లు విఫ‌ల‌మైనా అవి ఎందుకు విఫ‌ల‌మ‌య్యాయో ?  ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. చాలా యేళ్ల త‌ర్వాత దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఒకరిపై మరొకరికి నమ్మకం లేనప్పుడు కలిసి జీవించడం కన్నా విడిపోవడమే మేలని చెప్పింది. రెండు సార్లు తన ప్రేమ విఫలం కావడానికి ఇదే కారణమని తెలిపింది. న‌మ్మకాలు విఫ‌ల‌మ‌వ్వ‌డంతోనే త‌న తొలి రెండు బంధాలు తెంచుకున్నాన‌ని.. ఆ స‌మ‌యంలో తాను ఎంత బాధ అనుభ‌వించానో త‌న‌కే తెలుస‌ని చెప్పింది. 

 

ఇక ప్ర‌స్తుతం ఆమె కోలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమలో ఉంది. విఘ్నేష్ ఆమె కంటే యేడాది చిన్న‌వాడు. అయినా అత‌డిలో ప్రేమ‌లో ఉంది. వీరిద్ద‌రు గ‌త మూడేళ్లుగా ప్రేమ‌లో ఉన్నా ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోవ‌డం లేదు. మ‌రి న‌య‌న్ ఇత‌డిని అయినా పెళ్లి చేసుకుంటుందో ?  లేదా ? అన్న‌ది తెలియాలంటే కొద్ది కాలం ఆగ‌క త‌ప్ప‌దేమో ?

మరింత సమాచారం తెలుసుకోండి: