ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది.  ఎక్కడి వ్యవస్థలు అక్కడే ఆగిపోయాయి.. ముఖ్యంగా సినీ పరిశ్రమ షట్ డౌన్ అయ్యింది.  దాంతో వేలాది సినీ కార్మికులు కష్టాల్లో పడిపోయారు. అయితే అన్ని సినీ పరివ్రమల సెలబ్రెటీలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.. లక్షలు.. కోట్లు విరాళం ఇస్తూ మేమున్నామ్న ధైర్యాన్ని వారిలో నింపుతున్నారు.  ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితులో ఎవరైనా విరాళం ఇచ్చి నేను ఇంత ఇచ్చాను అన్న బిల్డప్ మాత్రం ఇవ్వడం లేదు.. కానీ ఇప్పుడు తాను ఇచ్చిన విరాళం గురించి పదే పదే ప్రస్తావన తెస్తున్నారని ప్రముఖ నటుడు, డైరెక్టర్ లారెన్స్ పై కొంత మంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

 

కరోనాను  ఎదుర్కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారత క్రికెటర్లు, సెలబ్రెటీలు అందరూ తమ వంతు సహాయం చేస్తున్నారు. అదే విధంగా ఈ కరోనా పై పోరాడటానికి రాఘవ లారెన్స్ 3 కోట్లు విరాళం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. మొదట తాను ఇచ్చిన ఆ 3 కోట్లు చంద్రముఖి 2 సినిమా కోసం సన్ పిక్చర్స్ సంస్థ వాళ్లు ఇచ్చిన అడ్వాన్స్ అని తెలియజేసాడు. దాంతో ఫ్యాన్స్ ఎంతో ఆనందించారు.. మనసున్న లారెన్స్ అని పొగిడారు.  

 

 

నిన్ను 3 కోట్లు సహాయం చేసిన తరువాత చాలా మంది నాకు ఫోన్ చేసి వారి కష్టాలు చెప్పి సహాయం చేయమంటున్నారు కానీ నేను వారికి సహాయం అందించలేక పోతున్నాను అని అన్నాడు. తర్వాత తాను సహాయం చేసిన విషయానికి చాలా మంది కృతజ్ఞతలు చెబుతున్నారని.. అది నా కర్తవ్యం అని మళ్లీ ఓ పోస్ట్ పెట్టారు. ఇక్కడే జనాలకు చిర్రెత్తుకొచ్చింది.. చాలా మంది సెలబ్రెటీలు ఎంతో సహాయాన్ని అందించారు... కానీ పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావించలేదని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: