ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం  ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్  విధించింది. ఆ తర్వాత లాక్ డౌన్  పొడిగిస్తారా లేదా అనే అనుమానం అందరిలో నెలకొంది. అయితే లాక్ డౌన్  పొడిగించాలా వద్దా అనే దానిపై... దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల  ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి  అభిప్రాయాలు సేకరించిన విషయం తెలిసిందే. ఇక్కడి వీడియో కాన్ఫరెన్స్ ముగియగానే మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్  30 వరకు లాక్ డౌన్  కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే పొడిగించిన లాక్ డౌన్  నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ పరిస్థితి దారుణంగా ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు. 

 

 

 ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  ప్రకటించక  ముందు నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్  తెలంగాణలో అమలు చేసిన విషయం తెలిసిందే. మూడు వారాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్  కొనసాగుతోంది. ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమ మొత్తం షట్ డౌన్ అయిన విషయం తెలిసిందే. అన్ని రకాల సినిమా షూటింగులు సీరియల్ షూటింగులు ఆగిపోయాయి . దీంతో సినీ కార్మికులకు ఉపాధి కరువవడంతో   తిండి లేక అవస్థలు పడుతున్నారు. స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు... స్టార్ నిర్మాత నుంచి చిన్న నిర్మాతల వరకు లాక్ డౌన్ పై  అంతగా సంతృప్తిగా లేరు. ఎందుకంటే లాక్ డౌన్  కారణంగా అందరూ తీవ్ర నష్టాల పాలవుతున్నారు. 

 

 

 సినిమాలు విడుదల అయితే నిర్మాతలకు లాభాలు వస్తాయి కానీ సినిమా షూటింగ్ అర్ధంతరంగా ఆగిపోతే పూర్తిగా నష్టాలపాలవుతారు . అయితే కొన్ని సినిమాలు ఇంకా పట్టాలెక్కలేదు.. కొన్ని షూటింగ్ దశలో ఆగిపోయాయి మరికొన్ని షూటింగ్ పూర్తిచేసుకుని ల్యాబ్ పరిమితమయ్యాయి. అన్ని పూర్తయినప్పటికీ ప్రస్తుతం సినిమాలను విడుదల చేయలేని పరిస్థితి. దీంతో నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. హీరోలు హీరోయిన్లు కూడా భారీగా నష్టపోతున్నారు. వీరి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సినీ కార్మికుల పరిస్థితి మాత్రం రోజురోజుకూ అధ్వానంగా మారిపోతున్నాయి. ఇంటి అద్దె  కూడా కట్టలేని  పరిస్థితి ఏర్పడుతుంది. సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా రోజురోజుకూ పరిస్థితి దారుణంగా మారుతుంది . థియేటర్ లను  మెయింటైన్ చేస్తున్న సిబ్బందికి సినిమా ఆడినా ఆడకపోయినా జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. ఇక ఇప్పుడు లాక్ డౌన్ పొడగించటం  మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయింది తెలుగు చిత్ర పరిశ్రమకు.

మరింత సమాచారం తెలుసుకోండి: