హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి సంక్రాంతికి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో సూప‌ర్‌హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న‌కు ఈ సంక్రాంతికి ఆ హిట్టే కాక మ‌రో గుడ్ న్యూస్ కూడా ఉంది అదేమిటంటే...స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరుగుతున్న సమయంలోనే అనిల్ రావిపూడి భార్య ఓ మగబిడ్డకి జన్మనిచ్చింది. అప్పుడు ఆయన పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.

 

సినిమా సక్సెస్ ఇచ్చిన ఆనందం .. ఆ సమయంలో ఆయన పొందిన అనుభూతి ఎప్పటికీ గుర్తుండేలా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ‘సరిలేరు నీ కెవ్వరు’ సినిమాలో మహేశ్ బాబు పాత్ర పేరు ‘అజయ్ కృష్ణ’. మహేశ్ పాత్రను డిజైన్ చేసిన కారణంగా ఆ పాత్ర జనంలోకి బాగా దూసుకెళ్ళింది. ఆ పాత్ర‌కి మంచి పేరు  కూడా వ‌చ్చింది.

 

ఆ పాత్ర నుంచే ‘అజయ్’ను తీసుకుని, ఆ పేరు పక్కన ‘సూర్యాంశ్’ ను జోడించాడు. అలా ఆయన తన కుమారుడికి ‘అజయ్ సూర్యాంశ్ ‘అని నామకరణం చేసినట్టుగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. మహేశ్ బాబు పట్ల అభిమానం .. ఆ పాత్ర పట్ల ప్రేమ కారణంగానే తాను అలా చేశానని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఆయ‌న పుట్టించిన పాత్ర పైన ఉన్న అభిమానంతో ఆ పేరు పెట్టాల‌ని చాలా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాడు అనిల్‌రావి పూడి. ప్ర‌స్తుతం అనిల్ వెంక‌టేష్‌తో క‌లిసి  ఎఫ్‌3 చేయాల‌నే బిజీలో ఉన్నారు. అయితే అంతా లాక్‌డౌన్‌తో ఉన్నందున ఆ ఆ క‌థ‌ని డెవ‌ల‌ప్ చేస్తున్నారు అనిల్‌. అందులో హీరోయిన్ల‌ను మాత్రం ఇంకా ఫైన‌ల్ చెయ్యాల్సి ఉంది.  త‌మ‌న్నా, మెహ‌రీన్‌ల‌నే కంటిన్యూ చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు చెప్పాడు. హీరోయిన్ల విష‌యంలో ఇలా క్లారిటీ ఇచ్చిన అనిల్ హీరోల విష‌యంలో మాత్రం ఏం చెప్ప‌లేదు. ఈ సినిమాలో కొత్త హీరోయిన్లు న‌టిస్తారు అంటూ వ‌చ్చే వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కూడా చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: