బాలీవుడ్ బాద్ షా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు. ఆయన స్వరపరిచి పాడిన గేందాపూల్ ఆల్బమ్.. బెంగాల్ కళాకారుడు రచించి పాడిన రతన్ కహాాన్ పాటకు కాపీ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన ప్రతిభకు గుర్తింపుగా సాయం చేస్తానన్నారు. ఈ క్రమంలో 5లక్షలు సాయం అందించాడు బాద్ షా. 


గేందాపూల్ అనే ప్రైవేట్ సాంగ్ యూ ట్యూబ్ లో పదిరోజుల్లో 10కోట్ల వ్యూస్ తో ట్రెండింగ్ అయింది. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గ్లామర్ సాంగ్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ పాటపై కాపీ ఆరోపణలు వెల్లువెత్తాయి. తనపై వస్తోన్న విమర్శలపై బాద్ షా స్పందిస్తూ.. ఇప్పటిదాకా ఈ పాటను ఎంతోమంది కాపీ కొట్టారంటూ.. తను కూడా మినహాయింపు కాదని ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు బాద్ షా. రతన్ కహర్ కు తను చేయగలిగినంత సాయం చేస్తానన్నాడు. 


బెంగాల్ జానపద కళాకారుడు రతన కహార్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. గేందా పూల్ పాట తన పాటను పోలి ఉందని.. న్యాయపోరాటం చేయడానికి డబ్బులు లేవని.. కూతురు పెళ్లికి ఆర్థిక సాయం అందిస్తే బాగుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు రతన్. బాద్ షా స్పందించి రతన్ అకౌంట్ వివరాలు తీసుకొని ఆయన ఖాతాల్లో 5లక్షలు జమ చేశారు. బాద్ షా చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు రతన్.

 

తన ఇంటికి రావాలని బాద్ షాను ఆహ్వానించారు. సంగీతానికి సంబంధించిన పలు విషయాలు బాద్ షా లో చర్చించాలనుకున్నట్టు రతన్ తెలిపారు. మరి బాద్ షా రతన్ ఆహ్వానాన్ని మన్నిస్తారో లేదో చూడాలి. మొత్తానికి బాలీవుడ్ బాద్ షా తన మాటను నిలబెట్టుకున్నారు. మానవత్వాన్ని చాటుకొని అభిమానులను ఆకట్టుకున్నారు.  రతన్ కహర్ కు ఐదు లక్షల రూపాయల సాయం ప్రకటించి ఔరా అనిపించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: