బన్నీ, సుకుమార్ సినిమాకు ఎవరూ ఊహించని టైటిల్ పెట్టారు. శేషాచలం, అడవిదొంగలు లాంటి టైటిల్స్ బయటికొచ్చినా.. బన్నీ క్యారెక్టర్ పేరునే టైటిల్ గా మార్చేశారు. ఈ విషయంలో బన్నీ మాత్రం వెంకటేశ్ ను ఫాలో అయ్యాడు. 

 

అల వైకుంఠపురములో తర్వాత బన్నీ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. బన్నీ కెరీర్ లో 20వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 1980కాలంలో చిత్తూరు ప్రాంతంలోని ఎర్రచందనం స్మగ్లింగ్ కథతో బన్నీ.. సుకుమార్ మూవీ రూపొందుతోంది. బన్నీ లారీ డ్రైవర్ గా.. హీరోయిన్ రష్మిక మందనా.. గిరిజన యువతిగా నటిస్తోంది. 

 

బన్నీ బర్త్ డే సందర్భంగా గత బుధవారం ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్స్ ఎనౌన్స్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా పుష్ప అనే టైటిల్ ఎనౌన్స్ చేశారు. వేలిముద్రలతో లోగో డిజైన్ చేశారు. టైటిల్ విషయంలో బన్నీ వెంకటేశ్ ను ఫాలో అయ్యాడు. క్యారెక్టర్ పేరే టైటిల్ గా పెట్టాడు సుకుమార్. వెంకటేశ్ గత చిత్రాలు తులసి.. లక్ష్మీ టైటిల్స్ ను గుర్తు చేస్తున్నాడు బన్ని. సినిమాలో క్యారెక్టర్ తులసిరామ్ తులసిగా.. లక్ష్మీనారాయణను లక్షఅమిగా పెట్టడంతో.. హీరోయిన్స్ పేర్లనే టైటిల్స్ గా పెట్టారనిపించింది. 

 

పాత్రపేరే టైటిల్ గా మారింది.  సినిమాలో బన్నీ పాత్ర పేరు పుష్పక్ నారాయణ్ అయితే.. ముద్దుగా పిలుచుకునే పుష్పను టైటిల్ గా ఫిక్స్ చేసేశారు. అల వైకుంఠపురములో.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. దువ్వాడ జగన్నాథమ్ లాంటి లాంగ్ టైటిల్స్ తో వచ్చిన బన్నీ.. ఈ సారి రెండక్షరాల టైటిల్ తో సింపుల్ గా వస్తున్నాడు. 

 

అల వైకుంఠపురముతో బన్నీ.. ఫస్ట్ టైమ్ 100కోట్ల క్లబ్ లో చేరినా.. 150కోట్లు క్రాస్ చేసినా.. ఓ వెలితి మాత్రం బన్నీని వెంటాడుతూనే ఉంది. తోటి స్టార్స్ తో పోల్చుకుంటే బన్నీ ఓ విషయంలో వెనుకబడిపోయాడు. ఈ విషయాన్ని  సీరియస్ గా తీసుకున్న స్టైలిష్ స్టార్.. పుష్పతో పాన్ ఇండియా డ్రీమ్ ను తీర్చేసుకుంటున్నాడు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: