యాంకర్ గా బుల్లి తెరను అలరిస్తున్న అనసూయ ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. తెలుగు సినిమాల్లో ఆమెకు ముందు నుంచి అవకాశాలు వస్తున్నా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తుంది. ఏ సినిమా పడితే ఆ సినిమాను ఆమె చేయడం లేదు. ప్రస్తుతం అనసూయకు విలన్ గా కూడా అవకాశాలు వస్తున్నాయి. కథ బాగుంటే ఏ పాత్ర అయినా సరే చేయడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం ఆమె సినిమాలు రెండు సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సినిమాలను చేయడానికి ఇప్పటి నుంచే లైన్ లో పెట్టుకుంటుంది 

 

ఇది పక్కన పెడితే ఆమెకు మెగా స్టార్ చిరంజీవి హీరోగా వచ్చే సినిమాలో అవకాశం వచ్చింది అంటున్నారు. చిరంజీవి లూసిఫర్ రీమేక్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చింది అని సమాచారం. కథ బాగున్న నేపధ్యంలో ఆమె సినిమాకు ఒప్పుకుంది. అంటే కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండటం ఆమె సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఆమె నితిన్ హీరోగా ఒక సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాతో పాటే చిరంజీవి సినిమాలో ఒక కీలక పాత్రను దక్కించుకుంది. 

 

టాలీవుడ్ జనాలకు ఆమె బాగానే నచ్చింది. ఆమె పాత్ర సినిమాలో ఉంటే ఎలా ఉంటుందా అని రంగస్థలం సినిమా నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల్లో భిన్నమైన పాత్రలనే ఆమె చేస్తుంది. ఇక ఆమె విలన్ గా ఏ విధంగా నటిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. పారితోషికం కూడా భారీగా తీసుకుంటుంది ఈ యాంకర్. మరి ఎంత తీసుకుంటుంది ఏంటీ అనేది తెలియదు. ఇక రామ్ చరణ్ చేసే సినిమాలో కూడా ఆమెకు ఒక పాత్ర దక్కే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: