రీమేక్ సినిమాలకు మన తెలుగులో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. తమిళంలో, హిందిలో, మలయాళ౦లో చేసే సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న నేపధ్యంలో ఇప్పుడు ఎక్కువగా దర్శక నిర్మాతలు రీమేక్ చెయ్యాలి అని భావిస్తున్నారు. రీమేక్ సినిమాలకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించడం తో మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని హీరోలు కూడా ఓకే చేస్తున్నారు. మన తెలుగు మార్కెట్ లో ఇప్పుడు వీటి హవా ఎక్కువగా ఉన్న సంగతి అర్ధమవుతుంది. అగ్ర హీరోలు అందరూ ఇప్పుడు ఈ సినిమాల మీద దృష్టి పెట్టారు. 

 

మెగాస్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీ సినిమా... ఖైదీ నెంబర్ 1 కూడా రీమేక్. ఆ తర్వాత కొందరు హీరోలు కూడా రీమేక్ సినిమాలు చేసారు. చిరంజీవి మరో రీమేక్ సినిమా చేస్తున్నారు. సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఇప్పుడు రీమేక్ సినిమా మీద దృష్టి పెట్టారు. ఆయన చేస్తున్న నారప్ప సినిమా రీమేక్ గానే వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వెంకటేష్ తో పాటుగా కొందరు సీనియర్ హీరోలు ఇదే బాటలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అలగే చేస్తున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు హరీష్ శంకర్ ఒక మలయాళం సినిమా మీద దృష్టి పెట్టారు. 

 

ఆ సినిమాను తెలుగులో చెయ్యాలి అని ఆయన భావిస్తున్నారు. గబ్బర్ సింగ్ అనే రీమేక్ సినిమాను చేసారు ఆయన. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరో రీమేక్ సినిమా మీద ఆయన దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. మలయాళంలో ఒక అగ్ర హీరో నటించిన రీమేక్ సినిమా చెయ్యాలి అని చూస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించిన హక్కులను ఒక నిర్మాత కొనుగోలు కూడా చేసినట్టు సమాచారం. హరీష్ శంకర్ సూచన తోనే దాన్ని ఓకే చేసారట. దీనిపై అధికారిక ప్రకటన రానుంది,

మరింత సమాచారం తెలుసుకోండి: