తెలుగు సినిమాల్లో నెంబర్ వన్ హీరోగా టాలీవుడ్ ను మూడు దశాబ్దాలకు పైగా ఏలుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల్లోకి వెళ్లి తిరిగొచ్చినా చిరంజీవి శిఖర సమానమైన క్రేజ్ కు తిరుగులేకుండా పోయింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇండస్ట్రీలో దాసరి లేని లోటును ఎంతో నిబద్ధతతో నెరవేరుస్తున్నాడు చిరంజీవి. ఉపాధి కోల్పోయిన కార్మికుల కోసం సీసీసీని ఏర్పాటు చేసి వారికి నిత్యావసరాలు అందేలా ఏర్పాట్లు చేశాడు. ఇండస్ట్రీలో కష్టపడి పైకొచ్చిన వ్యక్తిగా ప్రస్తుతం సినిమా గమనంపై కూడా ఆలోచిస్తున్నాడు మెగాస్టార్.

 

 

కరోనా దెబ్బకు దేశంలోని వ్యవస్థలన్నీ కుంటుపడ్డాయి. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. ప్రస్తుతం ప్రజలు లాక్ డౌన్ అయ్యాక కూడా సినిమా గురించి ఆలోచించే స్థితిలో లేరన్నది నిజం. ఈ సమయంలో సినీ పరిశ్రమ గట్టెక్కెదెలా.. ఎలా ఈ పరిస్థితులను దాటాలి అనే అంశంపై కూడా ఇటివల కొందరు సన్నిహితులతో చర్చించాడట చిరంజీవి. ప్రేక్షకుల్ని ధియేటర్లకు రప్పించడం సినిమాకు కష్టమేమీ కాదు. కానీ.. కరోనా కొట్టిన దెబ్బ వ్యక్తులపై కాదు.. వ్యవస్థలపై. సినిమా అంటే ఇష్టపడే ఎందరి జీవితాలనో ఆర్ధికంగా కుదేలయిపోయేలా చేసింది. ఈ పరిస్థితుల్లో జనాలు ధియేటర్లకు రావడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడట చిరంజీవి.

 

 

ఫైనాన్షియర్ల నుంచి డబ్బులు తెచ్చి సినిమాలు తీస్తున్న నిర్మాతల దగ్గర నుంచి.. లైట్ బాయ్ వ్యవస్థ వరకూ అందరూ నష్టాల్లోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా అందరూ దీనిపై చర్చించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడట. సినీ పరిశ్రమ మనుగడ సాధించాలంటే పరిశ్రమలోని అన్ని శాఖలు సమన్వయం కావాల్సి ఉందని సూచన చేశాడట మెగాస్టార్. మరి చిరంజీవి తీసుకుంటున్న చర్యలు, పరిశ్రమ గురించి చేస్తున్న ఆలోచనలపై మిగిలిన పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీ తీసుకోబోయే నిర్ణయాలు సినీ పరిశ్రమకు ముఖ్యం కానున్నాయని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: