సెట్స్ పై ఉన్న ఆరు సినిమాలపై సౌత్ ఇండస్ట్రీలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఆరు సినిమాల కోసం మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా టార్గెట్ గా తెరకెక్కుతుండటం విశేషం. 

 

ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మోస్ట్ అవెటెడ్ మూవీ అని చెప్పాలి. బాహుబలి వైబ్రేషన్స్ ఈ సినిమాకు హెల్ప్ కానున్నాయి. బాహుబలి లాంటి ఎపిక్ తర్వాత రాజమౌళి, రామ్ చరణ్ ఎన్టీఆర్ లను స్టార్స్ తో ఆర్ఆర్ఆర్ చేస్తుండటంతో ఈ మూవీ రేంజ్ ఎక్కడికో వెళ్లింది. చరణ్, ఎన్టీఆర్ లకు నార్త్ లో పెద్దగా క్రేజ్ లేదు. అయితే బాహుబలి క్రియేటర్ గా రాజమౌళి బ్రాండ్ తో ఆర్ఆర్ఆర్ కు నార్త్ లో కూడా భారీ భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాతో జక్కన్న బాహుబలి రికార్డ్స్ నే టార్గెట్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. 

 

ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా జాన్ మీద దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. బాహుబలితో అద్భుత విజయం అందుకున్న ప్రభాస్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ క్రేజ్ సాహో సినిామకు బాగా కలిసొచ్చింది. సాహో తెలుగు వెర్షన్ కు ఫ్లాప్ టాక్ వచ్చిన నార్త్ లో మాత్రం వందకోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు జాన్ కూడా ఇదే స్థాయిలో అటు సౌత్ తో పాటు నార్త్ లో బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తోందని సినీ పండితులు లెక్కలు వేస్తున్నారు. 

 

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా పాన్ ఇండియా టార్గెట్ గా రూపొందుతోంది. టాలీవుడ్ దాటి ఎప్పుడు పక్క మార్కెట్ పై ఫోకస్ పెట్టని పవర్ స్టార్ ఈ సారి స్టోరీ డిమాండ్ చేయడంతో పాన్ ఇండియాను టార్గెట్ చేస్తున్నాడు. తెలుగులో పవన్ బిగ్ స్టార్ కాబట్టి ఇక్కడ కలెక్షన్ల సునామీ ఉంటుంది. కానీ కోలీవుడ్, బాలీవుడ్ లోనే పవన్ ఏ మేరకు నెట్టుకొస్తాడనేది ఆసక్తిగా మారింది. క్రిష్ ఇప్పటికే బాలీవుడ్ లో గబ్బర్, మణికర్ణిక లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాల సక్సెస్ పవన్ సినిమాకు ఎంత వరకు హెల్ప్ అవుతుందో కూడా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: