టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం ఉన్న వారిలో చెప్పుకుంటే వారిలో ప్రగతి ఒకరని చెప్పొచ్చు. ముఖ్యంగా మదర్ పాత్రలకు ఆమె పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు. హీరో, హీరోయిన్ లకు మదర్ రోల్స్ చేస్తూ ఆమె పాపులారిటీ తెచ్చుకున్నారు. సినిమాల్లో వీఋ ఇచ్చిన పాత్రలు చేస్తూ ఏదో మామా అనిపించేస్తారు కానీ వాళ్లలో కూడా సూపర్ టాలెంట్ ఉంటుందని తెలుస్తుంది. క్యారక్టర్ యాక్టర్ ప్రగతిలో ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఒక టాలెంట్ బయట పడ్డది. 

 

ప్రస్తుతం లాక్ డౌన్ టైం లో తమ ఆన్ టాలెంట్ చూపిస్తుంది ప్రగతి. తన కొడుకుతో డ్యాన్స్ చేస్తూ హంగామా చేసింది ప్రగతి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లుంగీ కత్తికి మరి ప్రగతి చేసిన డ్యాన్స్ వీడియో చూసి అందరు ముక్కున వేలేసుకున్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ బాద్షా సినిమాలో ప్రగతి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నది. అయితే ఈసారి మాస్ బీట్ తో టాలీవుడ్ ఆంటీ ఊపు ఊపేసింది. తెలుగులో పద్ధతైన పాత్రలు చేసి అలరిస్తున్న ప్రగతి ఇలా రెచ్చిపోవడం చూసి అందరు షాక్ అవుతున్నారు. 

 

క్వారెంటైన్ టైం లో ఏం చేయాలో తెలియక అందరు తమలోని కొత్త టాలెంట్ బయటకు తీస్తున్నారు. ప్రగతి పెట్టిన వీడియో చూసి ఇంతకొంతమంది వాళ్ళ వాళ్ళ టాలెంట్ చూపించే అవకాశం ఉంది. ప్రగతి డ్యాన్స్ వీడియో చూసి దర్శక నిర్మాతలు తనలోని ఈ యాంగిల్ తో సినిమాలో ఆమెని వాడుకునేలా చూస్తున్నారు. ప్రగతి లాంటి క్యారక్టర్ ఆర్టిస్ట్ క్వారెంటినే టైంను ఇలా ఎంజాయ్ చేస్తుందన్న మాట. లాక్ డౌన్ ఎత్తేసేలోగా అందరు తమ టాలెంట్ తో వాళ్ళకు కొత్త ఇమేజ్ తెచ్చుకునేలా ఉన్నారు. సో కొత్త సినిమాల్లో ప్రగతికి ఈ డ్యాన్స్ ఇమేజ్ కూడా యాడ్ అయ్యేలా ఉంది. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Quarantine tales #vaathicoming #mothersonduo #master💕❤🤪🤪 HAPPY EASTER🤩😍🤩

A post shared by Mahavadi Pragathi (@pragstrong) on

మరింత సమాచారం తెలుసుకోండి: