లాక్ డౌన్ పీరియడ్ లో ఎక్కడికీ వెళ్లే ఛాన్స లేదు .  అటు అమితాబ్ బచ్చన్  నుంచి అప్ కమింగ్  హీరోల వరకూ అందరూ ఇంట్లోనే జిమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. రీసెంట్ గా తన జిమ్ లో ట్రెడ్ మిల్ దగ్గర నుంచొని ట్రెడ్ మిల్ రన్  చేస్తూనే ఉండు , రెసిస్టెన్స్ పెంచుకో, ఫైట్ చెయ్.. చేస్తూనే ఉండు అంటూ సెల్‌ఫీ  పోస్ట్ చేశారు. బాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హంక్, బాడీ మెయింటెన్ చేసే హీరో హ్రుతిక్ రోషన్. సినిమాలు ఉన్నా లేకపోయినా స్టిల్ వర్కవుట్స్ చేస్తూ బాడీ మెయింటెన్ చేసే ఈ హీరో కూడా క్వారంటైన్ టైమ్ లో జిమ్ లో పడుకుని  తనకుక్క జేన్ తో ఫోటో పోస్ట్ చేశాడు .

 

మా జేన్ మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాడు. అదేంటంటే ..మా డాడీ లానే మీరు కూడా ఇంట్లోనే ఉండండి సేఫ్ గా అంటూ ఓ క్యూట్ మెసేజ్ ని పోస్ట్ చేశాడు . సీనియర్ హీరో అనిల్ కపూర్ .. కరోనా అయినా..క్వారంటైన్ అయినా నా వర్కవుట్స్ కి మాత్రం రెస్ట్ లేదంటున్నాడు. తన జిమ్ లో సీరియస్ గా స్పీడ్ గా సైక్లింగ్ చేస్తూ.. వర్కవుట్ మాత్రం కంపల్సరీ అంటున్నాడు. ఎందుకంటే నేను లేజీగా ఉన్నా.. నా పర్సనల్ ట్రెయినర్ మాత్రం నన్ను అస్సలు వదలిపెట్టడు అంటూ  ఇంట్లోనే వర్కవుట్స్ చెయ్యండని చెబుతున్నాడు ఈ సూపర్ కూల్ సీనియర్ హీరో.
 
రాజ్ బబ్బర్ కొడుకు ప్రతీక్ బబ్బర్ కూడా తన ఇంట్లో జిమ్ లో మాస్క్ వేసుకుని మరీ వెయిట్స్ ఎత్తుతూ వర్కవుట్స్ చేస్తున్నాడు. తన ఫిజిక్ తో ఫ్యాన్స్ ని ఎప్పుడూ సర్ ప్రైజ్ చేసే టైగర్ ష్రాఫ్ సినిమాలు లేవు కదా అని ఖాళీగా లేడు. ఆ బాడీని మెయింటెన్ చెయ్యడానికి ఇంట్లోనే కసరత్తులు చేస్తున్నాడు . బాల్కనీలో చల్లగాలి మద్య వెయిట్స్ ఎత్తుతున్నాడు . అంతేకాదు .. మా చిన్నప్పుడు మా  అమ్మ ఎప్పుడూ మమ్మల్ని ఇంట్లో ఆడుకోనిచ్చేది కాదు .. కానీ ఇప్పుడు వేరే ఛాన్స్ లేదుగా అంటూ ఇంట్లోనే ఫుల్ బాల్ ఆడుతున్న వీడియో పోస్ట్ చేశాడు టైగర్ ష్రాఫ్.

 

మరో యంగ్ హీరో విక్కీ కౌషల్ కూడా తన ఇంట్లో జిమ్ లో ఉన్న డంబెల్స్, వెయిట్స్ అన్నీ చూపిస్తూ.. ఇప్పుడు లాక్ డౌన్ పీరియడ్ లో  ఇవే నా ఫ్రెండ్స్ అంటూ ఫోటో పోస్ట్ చేశాడు . ఇక మరో  హీరో వరుణ్ ధావన్ కూడా ఫస్ట్నుంచీ  తనఫిజిక్ ని మెయింటెన్ చేస్తూనే ఉన్నాడు . ఈ క్వారంటైన్ టైమ్ లో  తన జిమ్ లో రాత్రి పూట డిఫరెంట్ డిఫరెంట్ వర్కవుట్స్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: