ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య ఒక్కటే.. కరోనా వైరస్.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తుంది.  ముఖ్యంగా ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా లాంటి అగ్ర రాజ్యాల్లో బయోత్పాతాన్ని సృష్టిస్తుంది. అమెరికాలో అయితే దారుణంగా మరణాలు నమోదు అవుతున్నాయి. కుప్పలు తెప్పలుగా అక్కడ మృతదేహాలను తరలించే ప్రయత్నాల్లో అష్ట కష్టాలు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక భారత దేశంలో కరోనాని అరికట్టేందుకు లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. జబర్ధస్త్ తో ఎంతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ ఇప్పుడు లాక్ డౌన్ లో ప్రజలు పడుతున్న కష్టాల గురించి మాట్లాడారు.. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత సంక్షోభ సమయంలో రైతులను ఉద్దేశించి ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది.

 

ఈ కష్టకాలంలో రైతుకి అండగా ఉందామంటూ తన పోస్ట్ లో అనసూయమ పేర్కొంది.  దేశానికి వెన్నుముఖ రైతన్న అన్న విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. దేశానికి వెన్నెముక రైతు అని, ‘కరోనా’ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రైతుకి మనందరం అండగా నిలుద్దామని పిలుపు నిచ్చింది.   రైతును  దేశాన్ని కాపాడుకుందామని, రైతుకు మనం, మనకు రైతు అవసరమని ఈ విషయాన్ని ప్రతి ఒక్క భారతీయులు దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. రైతు పండించే మామిడి, అరటి, బత్తాయి, నిమ్మ, జామ పండ్లను కొనుక్కుని తిందామని, రోగ నిరోధక శక్తిని పెంచుకుందామని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందామని సూచించింది.  

 

ఇలాంటి కష్టకాలంలో మానవత్వం చూపించాలని.. ఒకరికి ఒకరం ధైర్యం చెప్పుకోవాలని అన్నారు.  దయచేసి ఈ సమయంలో రైతులను ఆదుకోవాల్సిన అసరం మనకు ఎంతైనా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.  

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

ఈ కష్టకాలంలో రైతుకి అండగా ఉందాం 🙏🏻 #FarmerIsTheBackBoneOfIndia #LetsMakeTheRightChoices #StayHomeSaveLives 🙏🏻

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: