తెలుగు ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడుగా జూనియర్  ఎన్టీఆర్ కి ఒక ప్రత్యేకత క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తాతకు తగ్గ మనవడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు ఎన్టీఆర్. ఇక నటన విషయంలో అయితే ఎన్టీఆర్ కి సాటి ఎవరూ లేరు అని చెప్పారు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేసి... జీవించి మరి నటించగల డు ఎన్టీఆర్. ఇప్పటి వరకు 30 సినిమాలకు చేరువైన ఎన్టీఆర్ తన కెరీర్లో ఎన్నో పాత్రల్లో నటించారు. ప్రతి పాత్రలోనూ ది బెస్ట్ గానే నటించారు, ఇక ఎన్టీఆర్ తో సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది.. అందుకే దర్శక నిర్మాతలు ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. 

 

 

 ఇదిలా ఉంటే... జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ సినిమా ఇప్పుడు వరకు విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమా ఏది అంటారా... జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు రామాయణం సినిమాలో రాముడిగా తన ఫిలిం కెరీర్ ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిన్ను చూడాలని అనే సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారిపోయాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చింది తాత  సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన హిందీ వర్షన్ బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ భరతుడి పాత్ర పోషించాడు. 

 

 

 తెలుగు వర్షన్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలకృష్ణ హరిశ్చంద్రుడు, దుశ్యంతుడి   పాత్రలు చేశారు. హిందీ వెర్షన్ లో  కూడా బాలకృష్ణ అదే పాత్రలో నటించాడు. కాగా ఈ సినిమాలో దుశ్యంతుడి కొడుకైనా భరతుడిగా జూనియర్ ఎన్టీఆర్  నటించాడు. మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలోనే  జూనియర్ ఎన్టీఆర్ హిందీ అనర్గళంగా మాట్లాడటం చూసి... తాత సీనియర్ ఎన్టీఆర్ హిందీ వర్షన్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో ఎన్టీఆర్ ను తీసుకున్నారు. కాగా  బ్రహ్మర్షి విశ్వామిత్ర తెలుగులో అట్టర్ ఫ్లాప్ కావడంతో హిందీ వెర్షన్ కు సంబంధించి సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ విడుదల మాత్రం చేయలేదు. ఆ తర్వాత రాజకీయాల్లో వెళ్లిన ఎన్టీఆర్సినిమా గురించి మర్చిపోయారు.ఇలా  హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: