తెలుగు సినిమాలు హాస్యానికి పెద్ద పీట వేస్తారు. సునిశిత హాస్యానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఫిదా అవుతారు. హాస్యభరిత సినిమాలే కాకుండా సినిమాల్లో హాస్యం వల్ల హిట్టయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సినిమాల లిస్టులో ‘ఢీ’ సినిమాకు ఖచ్చితంగా చోటు ఉంటుంది., శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. మంచు విష్ణు హీరోగా జెనీలియా హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా విడుదలై నేటితో 13 ఏళ్లు పూర్తి చేసుకుంది.

 

 

2007 ఏప్రిల్ 13న విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఎంత హిట్టయిందో ఇప్పటికీ టీవీల్లో వస్తే అంతే ఆదరణ దక్కించుకుంటుంది. ముఖ్యంగా సినిమాలో బ్రహ్మానందం, సునీల్ పోషించిన చారి, సత్తి పాత్రలు సినిమాకే హైలైట్. శ్రీహరి తన సీరియస్ కామెడీతో ఆకట్టుకున్నాడు. జయప్రకాశ్ రెడ్డి పాత్ర చాలా ఫన్నీగా డిజైన్ చేసిన శ్రీను వైట్ల సినిమా విజయానికి మూల స్థంబాల్లో ఒకటిగా నిలిపాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ అయింది కానీ.. విడుదల కావటానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. సినిమాను కొనటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎన్నో అవాంతరాలను దాటి ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఢీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

 

 

ఇదే విషయాన్ని మంచు విష్ణు తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ’13 ఏళ్ల క్రితం ఇదే రోజు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. నాన్న మోహన్ బాబు కోసమే ఈ సినిమా. లేకపోతే ఈ సినిమా విడుదలయ్యేది కాదు. ఇటువంటి కల్ట్ కామెడీ మూవీని నాకు ఇచ్చిన నా పెద్దన్న లాంటి శ్రీను వైట్లకు థ్యాంక్స్. మరి ఢీ2 ఎప్పుడు’ అని ట్వీట్ చేశారు. సిరి వెంకటేశ్వర మూవీస్ బ్యానర్ పై మల్లిడి సత్యనారాయణ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: