ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం యావ‌త్ ప్ర‌పంచ సినీ అభిమానులు ఎంత‌లా వెయిట్ చేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాహుబ‌లి 2 లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోలు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. చ‌రిత్ర‌లో ఎవ్వ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని సాహ‌సం రాజ‌మౌళి ఈ సినిమాతో చేస్తున్నాడు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

 

ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన సినిమా టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌, అల్లూరి  సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఏదో ఒక బ్రేక్ ప‌డుతూనే ఉంది. ఇక ఇప్పుడు క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఏకంగా షూటింగ్ వాయిదా ప‌డింది. ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుందో ?  తెలియ‌ని ప‌రిస్థితి. ఇక జూన్‌, జూలై నుంచి వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమా వాయిదా ప‌డింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8వ తేదీన ఈ సినిమా వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించింది. 

 

అయితే ఇప్పుడు షూటింగ్ జ‌రిగే ఛాన్సులు లేక‌పోవ‌డంతో ఈ లెక్క‌న చూస్తే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయట. అందుకే ఈ సినిమాను వచ్చే యేడాది 2021 ఏప్రిల్ 28న బాహుబలి 2 సినిమాను విడుదల చేసిన రోజునే  ఆర్ ఆర్ ఆర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట రాజ‌మౌళి. మరోవైపు బాహుబలి సినిమాలో ప్రభాస్ కంటే ఏజ్‌లో పెద్ద పాత్రలో రానా నటించారు. అన్నగా, పెదనాన్నగా రానా నటించారు. కానీ నిజ జీవితంలో మాత్రం రానా కంటే వయసులో ప్రభాస్ పెద్ద.

 

ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్‌లో రామ్‌చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్‌ను ఉద్దేశించి నా అన్న సీతారామ‌రాజు అని కొమ‌రం భీం రోల్ చేస్తోన్న ఎన్టీఆర్ అంటాడు... కానీ నిజ జీవితంలో చ‌ర‌ణ్ కంటే తార‌క్ వ‌య‌స్సు పెద్ద‌. ఈ లెక్క‌న బాహుబ‌లి సినిమాలో  ఉప‌యోగించిన రెండు ఫార్ములాల‌ను ఇక్క‌డ రాజ‌మౌళి అప్లై చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: