పూజా హెగ్డే 2014 లో బ్యాక్ టు బ్యాక్ సినిమా తో తెలుగులో అవకాశం దక్కించుకుంది. ముందుగా పూజా హెగ్డే కి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుంద సినిమాలో అవకాశం వచ్చింది. అదే సినిమా తో పాటు అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాలోను నటించింది. ఈ రెండు సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీజైయ్యాయి. రెండు సినిమాలతో హిట్ అందుకుంది. దాంతో టాలీవుడ్ లో మేకర్స్ అందరూ పూజా హెగ్డే ని తమ సినిమాలలో తీసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో నే వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

 

కాని పూజా హెగ్డే కూడా ఊహించని విధంగా బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన మొహంజాదారో లో అవకాశం వచ్చింది. దాంతో పూజా హెగ్డే తెలుగు సినిమా అవకాశాలను వద్దనుకొని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. హిందీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతానని కల కనింది. అక్కడ కూడా మరే సినిమా ఒప్పుకోకుండా దీపికా పదుకొణె లాగా హిస్టారికల్ మూవీస్ నటించి స్టార్ అవ్వాలనుకుంది. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో పూజా హెగ్డే కి గట్టి షాక్ తగిలింది. కాని అదృష్టం టాలీవుడ్ తలుపులు తెరిచింది. హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాధం లో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాతో తెలుగులో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

 

అయితే రీసెంట్ గా మళ్ళీ పూజా హెగ్డే కి బాలీవుడ్ నుంచి రెండు భారీ ప్రాజెక్ట్స్ లో ఆఫర్ వచ్చింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా తో పాటు వరుస విజయాలతో దూసుకుపోతున్న అక్షయ్ కుమార్ సినిమాల లో అవకాశలను అందుకుంది. అయితే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలుగుతున్న పూజా బాలీవుడ్ సినిమాలని ఒప్పుకొని మళ్ళీ పెద్ద పొరపాటు చేసిందని కామెంట్స్ చేశారు. అయితే కరోనా కారణంగా అన్నీ చిత్ర పరిశ్రమలలో ఊహించని పరిణామాలు తలెత్తాయి.

 

ఈ నేపథ్యంలో భారీగా హీరో హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ కూడా తగ్గనున్నాయట. ముఖ్యంగా పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ కి ఇది బాగా మైనస్ అని అంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో పూజా బాలీవుడ్ లో సినిమాలు ఒప్పుకోవడమే కరెక్ట్ అంటున్నారు. నిన్నా మొన్నటి వరకు తనని కామెంట్స్ చేసినవాళ్ళు ఇప్పుడు నోటి మిద వేలు వేసుకుంటున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: