గత రెండేళ్ల నుండి వరుస పరాజయాలను చవి చూస్తున్న
మాస్ మహారాజ్
రవితేజ కు ఈ ఏడాది ప్రారంభం లో కూడా షాక్ తప్పలేదు. ఇటీవల
రవితేజ,
డిస్కో రాజా తో ప్రేక్షకులముందుకు
రాగ ఈ చిత్రం కూడా డిజాస్టర్ల జాబితాలో చేరింది. ఇక ఈ
సినిమా తరువాత ప్రస్తుతం
రవితేజ,
గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో
క్రాక్ లో నటిస్తున్నాడు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈచిత్రంలో
రవితేజ ,
పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా దాదాపు షూటింగ్ కూడా పూర్తయింది.
ఇప్పటికే విడుదలైన
క్రాక్ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా అతి త్వరలో మొదటి సాంగ్ విడుదలకానుందని సమాచారం. ఈ చిత్రంతో
శృతిహాసన్ మళ్ళీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుండగా
సముద్రఖని , చిరాగ్
జానీ , వరలక్ష్మి
శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని మే 8న విడుదలచేయాలనుకున్నారు కానీ కరోనా వల్ల విడుదల వాయిదా పడే అవకాశాలు వున్నాయి. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా
రవితేజ ఈ
సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఇదిలావుంటే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు రవితేజ. అందులో భాగంగా క్రాక్ తరువాత రవితేజ, రమేష్ వర్మ డైరెక్షన్ లో నటించనున్నాడు. కోలీవుడ్ మూవీ శతురంగ వెట్టై 2 స్పూర్తితో తెరకెక్కనున్న ఈ చిత్రం జులై నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. సత్యనారాయణ కోనేరు ,హవీష్ కోనేరు ఈ సినిమా ను నిర్మించనున్నారు. ఈ సినిమా తోపాటు త్రినాథ రావు నక్కిన అలాగే నాపేరు సూర్య తో డైరెక్టర్ వక్కంతం వంశీ తో సినిమాలు చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.