కొణిదెల ఫ్యామిలీ నుండి వచ్చిన మెగాబ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక, ముందుగా నాగశౌర్య సరసన ఒకమనసు సినిమాలో హీరోయిన్ గా నటించడం జరిగింది. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ, నటిగా తన అందం, అభినయంతో నిహారిక తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తరువాత సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిన హ్యాపీ వెడ్డింగ్ లో నటించిన నిహారికసినిమా ద్వారా కూడా సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఆపై వచ్చిన సూర్యకాంతం సినిమాలో తన మార్క్ పెర్ఫార్మన్స్ తో తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు కొట్టిన నిహారిక, ఆశించిన రేంజ్ సక్సెస్ ని మాత్రం ఈ సినిమా ద్వారా కూడా పొందలేకపోయింది. 

 

ప్రస్తుతం తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్న నిహారిక, టాలీవుడ్ లో మంచి అవకాశం వస్తే తనని తాను నిరూపించుకుని హిట్ అందుకోవాలని చూస్తున్నారు. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం వరుసగా విజయాలతో దూసుకెళుతూ మంచి ఛాన్స్ లు దక్కించుకుంటున్న ఒక యువ స్టార్ హీరో తదుపరి సినిమాలో నిహారిక నటించనున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న ఆ హీరో, అతి త్వరలో తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేయనున్నారని, ఒక యువ దర్శకుడు తెరకెక్కించనున్న ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు నిహారిక కొణిదెల ఎంపికైనట్లు చెప్తున్నారు. 

 

మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎంతో మంచి ప్రాధాన్యం ఉంటుందని, కాగా అటువంటి పాత్రకు నిహారిక అయితేనే కరెక్ట్ అని భావించిన సదరు హీరో, దర్శకుడు ఇద్దరూ కూడా రెండు రోజుల క్రితం ఆమెను సంప్రదించినట్లు చెప్తున్నారు. తనకు కథ, కథనాలు ఎంతో నచ్చడంతో మెగా డాటర్ కూడా ఆ సినిమా చేయడానికి ఒప్పుకుందట. మరికొద్దిరోజుల్లో ఆ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, ఈ సినిమా ద్వారా నిహారిక దశ తిరిగినట్లే అని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: