టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముందుగా తెలుగులో నాగార్జున హీరోగా తెరకెక్కిన శివ ద్వారా తొలి సినిమాతోనే దర్శకుడిగా అత్యద్భుత విజయాన్ని అందుకుని అతి పెద్ద సెన్సేషన్ సృష్టించిన వర్మ, ఆ తరువాత తెలుగులో మరికొన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసారు. ఆపై బాలీవుడ్ చేరి అక్కడ కూడా కొందరు బడా స్టార్స్ తో మంచి హిట్ మూవీస్ తీసి మన తెలుగు వారి ఖ్యాతిని నార్త్ లో వెలుగెత్తి చాటిన వర్మ, ఇటీవల మాత్రం తన సినిమాలతో వరుసగా పరాజయాలు అందుకుంటున్నారు. ఇకపోతే కొన్నేళ్ల క్రితం ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసిన వర్మ, అప్పటి నుండి సమకాలీన సినీ, రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. 

 

ఇక తనకు నచ్చిన ఎటువంటి అంశం పైనైనా తన స్టైల్ లో స్పందించే అలవాటున్న వర్మ, ఇటీవల కొన్ని వివాదాస్పద అంశాలపై సినిమాలు కూడా తీయడం జరిగింది. ఇక ప్రస్తుతం యావత్ మన ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిపై కూడా వర్మ ఎప్పటికప్పుడు తన మార్క్ ట్వీట్స్ తో ట్విట్టర్ ని పరిగెత్తిస్తున్నారు. మొన్న దున్నపోతుపై ఉన్న యమధర్మరాజు ఫోటో పెట్టి, ఇక్కడ నరకంలో ఖాళీ లేదు హౌస్ ఫుల్ అయింది, దయచేసి అందరూ కూడా తమ తమ ఇళ్లలో ఉండండి అని యమధర్మరాజు అంటున్న ఫోటోని పోస్ట్ చేసారు వర్మ. మొన్నటికి మొన్నమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఇంటింటికీ లిక్కర్ సప్లై పై స్పందించిన వర్మ, మన రెండు తెలుగు రాష్టాల సీఎం లు అయిన జగన్, కేసీఆర్ లు కూడా ఆ విధంగా స్పందించి ప్రస్తుతం ఇళ్లలో మగ్గుతూ మందు దొరక్క అల్లాడిపోతున్న వారిపట్ల కాస్త జాలి చూపించి మీరు కూడా ఆ విధానాన్ని అమలు చేయాలని కోరడం జరిగింది. 

 

ఈ విధంగా వర్మ పోస్ట్ చేస్తున్న ట్వీట్స్ పై కొందరు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పటికే ఈ కరోనా అఫెక్ట్ తో అందరూ కూడా భయబ్రాంతులకు గురవుతుంటే మీరు ఈ విధంగా మీ అకౌంట్ ద్వారా సెటైర్లు వేస్తూ ట్వీట్స్ చేయడం సరైనది కాదని అంటున్నారు. ఇక మరికొందరు అయితే, ఆయనంతే అదోటైపు, మనం మారాల్సిందే గాని, ఆయన మారడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయినా తాను ఒకరి కోసం జీవించడం లేదని, తనకు నచ్చిన విధంగా జీవించే హక్కు తనకు ఉందని ఇప్పటికే వర్మ పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: