సుకుమార్ సినిమా అంటే హీరో కి ఎంతగా క్రేజ్ వస్తుందో అంత క్రేజ్ హీరోయిన్ కి వస్తుంది.  కాజల్ అగర్వాల్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో ఇప్పటికే ప్రూవ్ అయింది. ముఖ్యంగా సమంత. సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ సమంత అక్కినేని జంటగా నటించిన సినిమా రంగస్థలం. విలేజ్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా రికార్డుల మోత మోగించింది. ఇలాంటి క్యారెక్టర్ చరణ్ ఇప్పటి వరకు చేయనేలేదు. అయినా రంగస్థలం సినిమాతో చరణ్ ఇమేజ్ ఇంకా భారీగా పెరిగిపోయింది.

 

ఆర్య, ఆర్య 2, వన్ నేనొక్కడికే, నాన్నకు ప్రేమతో వంటి క్లాస్ సినిమాలు తెరకెక్కించిన సుకుమార్ ఫస్ట్ టైం రంగస్థలం లాంటి డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా రాం చరణ్ కెరీర్ లోనే బెగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా చిట్టిబాబు గా చరణ్ రామలక్ష్మి గా సమంత లకి అద్భుతమైన పేరు వచ్చింది. అయితే సుకుమార్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రంగస్థలం వంటి మాస్ కథని తెరకెక్కిస్తున్నాడు. అల వైకుంఠపురములో వంటి క్లాస్ సినిమా తర్వాత అల్లు అర్జున్ పక్కా మాస్ పాత్రని పోషిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా కి పుష్ప అన్న టిటిల్ ని ఫిక్స్ చేసి అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. 

 

ఇక పుష్ప పాన్ ఇండియా రేంజ్ సినిమా అని 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ తో సుకుమార్ అఫీషియల్ గా వెల్లడించారు. అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది మాత్రం  రష్మిక మందన్న. రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్రలో నటించిన సమంత కి ఎంతగా పేరొచ్చిందో ఇప్పుడు పుష్ప సినిమాకి అంతటి పేరు రష్మిక కి వస్తుమా అన్న టాక్ మొదలైంది. సుకుమార్ రామలక్ష్మి రేంజ్ లో రష్మిక పాత్ర ఉంటుందా అని చర్చించుకుంటున్నారట. ఒకవేళ నిజంగా రామలక్ష్మి గా సమంత కి వచ్చినంత క్రేజ్ గనక రష్మిక కి వస్తే ఇక అమ్మడు ఆకాశంలో విహరిస్తుందని తను కూడా ఈ సినిమా ఒకే అయినప్పటి నుంచి అదే ఊహల్లో ఉందని అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: