టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ గురించి ఏ న్యూస్ వచ్చినా అటెన్షన్ క్రియేట్ చేస్తూంటాయి. నాగార్జునకు, నాగచైతన్యకు జీవితభాగస్వాములుగా వచ్చిన అమల, సమంత ఇద్దరూ సినీ నేపథ్యం ఉన్నవారే. వీరివి ప్రేమ వివాహాలే. ముఖ్యంగా నాగ చైతన్య, సమంతల వివాహం అయిన తర్వాత వీరిద్దరి గురించి ఆసక్తి ఎక్కువైంది. పలు ఇంటర్వ్యూల్లో సమంత ఇచ్చే సమాధానాలు ఫన్నీగా ఉంటాయి. ఈ సందర్భంగా అమలతో ఓ వెబ్ మీడియాకు ఆమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ చెప్పింది.

 

 

ఇంట్లో సమంత మీకోసం వంట చేస్తుందా అని ఎదురైన ప్రశ్నకు అమల ‘నో’ అనే సమాధానం చెప్పింది. ‘సమంత ఇంట్లో వంట చేయదు. ఇంకా చెప్పాలంటే నాగార్జున వంట చేస్తారు. అప్పుడప్పుడు కిచెన్ లోకి వచ్చి వంటలు బాగా చేస్తారు. నాగార్జునలో మంచి కుక్ ఉన్నాడు. నాగార్జున ఉండగా ఇక సమంతకు వంటలు చేయాల్సిన అవసరం ఏముంది’ అంటూ నవ్వేశారు. ‘నేను కూడా నాగార్జున వంట చేస్తున్నప్పుడు సాయం చేస్తాను. కావాల్సినవి అందిస్తూంటాను. ఇంట్లో కుక్ ఉంటారు కాబట్టి సమంత వంట చేయాల్సిన అవసరం లేదు’ అని అక్కినేని ఇంట వంట గురించి చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది.

 

 

సోషల్ మీడియాలో నాగ చైతన్య, సమంతల గురించి న్యూస్ వస్తూంటుంది. రీసెంట్ గా లాక్ డౌన్ లో వీరి ఇంటి ముందు వాకింగ్ చేస్తున్న వీడియో హల్ చల్ చేసింది. ఆమధ్య వంట గదిలో వీరిద్దరూ కలిసి వంట చేయడం వైరల్ అయింది. అక్కినేని నాగేశ్వర రావుతో మొదలైన ఆ కుటుంబ ప్రస్థానం నేడు మూడో తరంతో విరాజిల్లుతోంది. తండ్రి నట వారసత్వాన్ని నాగార్జున ఘనంగా చాటారు. కుటుంబ నట వారసత్వాన్ని నాగచైతన్య, అఖిల్ నిలబెడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: