సౌత్ స్టార్ హీరోయిన్ గానే కాదు ఒక పెద్దింటి కోడలుగా సమంత మీద చాలా బాధ్యత ఉంది. అక్కినేని ఫ్యామిలీ కోడలిగా అడుగు పెట్టిన సమంత ఆ ఫ్యామిలీలో బాగా కలిసిపోయింది. చైతు, సమంతలను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. పెళ్లి తర్వాత చైతు కెరియర్ కూడా గాడిలో పడినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో కెరియర్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు చైతన్య. ఇక సమంత కూడా పెళ్లి తర్వాత తన ఫామ్ కొనసాగిస్తుంది. తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఆమె వరుస సినిమాలు చేస్తుంది. 

 

అక్కినేని కోడలిగా మారిన తవ్రాత నుండి సమంత మీద ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. మొదటిసారిగా అమల సమంత గురించి ఒక సీక్రెట్ బయట పెట్టారు. అదేంటీ అంటే సమంత ఇంట్లో అసలు వంట చేయదని అంటున్నారు అక్కినేని అమల. నాగ చైతన్యకు వంట చేయడం వచ్చు అందుకే సమంత వంట చేయడం మానేసింది. అంతేకాదు మా ఇంట్లో నాగార్జున మంచి వంట  మనిషి ఆయన ఉండగా మరో వంట మనిషిని ఎందుకు పెట్టుకోవడం అంటూ సరదాగా చెప్పుకొచ్చారు అమల. 

 

ప్రస్తుతం లాక్ డౌన్ టైములో అందరు హీరోలు తమలోని కుకింగ్ టాలెంట్ బయటకు తీస్తున్నారు. హీరోయిన్స్ అయితే రోజు అదే పనిలో ఉంటున్నారు. సమంత మాత్రం ఈ లాక్ డౌన్ టైములో పూర్తిగా నాగ చైతన్యతో సరదాగా గడుపుతుంది. అందుకే ఆమె కనీసమా సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు. అప్పుడప్పుడే చైతు తన పెట్ తో ఆడుకుంటున్న పిక్ పెట్టిన సామ్ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మరి సమంత ఈ క్వారెంటైన్ టైం లో ఏం చేస్తుంది అన్న డౌట్ ఆమె ఫ్యాన్స్ కు కూడా ఏర్పడేలా చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: