టాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే అయినా సరే కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ. ఆయన సినిమాలకు ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. కథ సామాజిక కోణం లో ఉన్నా సరే అది కమర్షియల్ గా ఉంటుంది అనేది అర్ధమవుతుంది. ఏ హీరో తో చేసిన సరే ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు ఆయన. అందుకే అవి హిట్ కూడా అవుతున్నాయి అనే విషయం అర్ధమవుతుంది. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవి తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. 

 

అప్పుడే కొరటాల తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు హీరోలు. ఎన్టీఆర్ తో తాను చేసే సినిమా అయిన తర్వాత తనతో సినిమా చెయ్యాలి అని జూనియర్ ఎన్టీఆర్ అడిగినట్టు సమాచారం. వచ్చే ఏడాది తాను ఈ సినిమా పూర్తి చేస్తా అని ఎన్టీఆర్ స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ఇక కొరటాల శివ తో సినిమా చేయడానికి మహేష్ బాబు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కథ ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట మహేష్ బాబు. ఇక ప్రభాస్ కూడా కొరటాల తో చేయడానికి రెడీ అవుతున్నాడు. 

 

వీళ్ళు అందరూ కూడా ఇప్పుడు కొరటాల తో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిగా చూపిస్తున్నారు. కొరటాల శివ ప్రస్తుతం కమర్షియల్ దర్శకుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తో సినిమా చేస్తే భారీ వసూళ్ళు వచ్చే అవకాశం ఉందనే భావనలో ఉన్న హీరోలు ఆయన వెంట పడుతున్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రస్తుతం కొరటాల ఆచార్య తో బిజీ గా ఉన్నారు కాబట్టి తర్వాత ఆ సినిమాలు లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: