టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ఒక సంచలనం. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తుందా అని అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా నందమూరి ఫ్యామిలీ అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే అందరూ కూడా ఆసక్తిగా చదువుతున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు అనే పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. 

 

ఆ తర్వాత... రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయగా దీనికి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్సినిమా చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. కొత్త కొత్త దర్శకుల వెంట అతను పడుతున్నట్టు సమాచారం. టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త దర్శకులను ఎవరూ పట్టించుకోవడం లేదు. కాని ఆయన మాత్రం కొత్త దర్శకుల వెంట పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కథ బాగుంటే మాత్రం ఆయన యువ దర్శకులను తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. 

 

యువ దర్శకులు ఇప్పుడు సినిమా విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నారు. పాత్ర బాగుంటే హీరోలు కూడా ఓకే చేస్తున్నారు. అందుకే ఇప్పుడు రామ్ చరణ్ కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి గాను ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే రామ్ చరణ్ వాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుంది అనే భావనలో ఉన్నాడని సమాచారం ప్రస్తుతం అతను ఆర్ఆర్ఆర్ తర్వాత ఏ సినిమా చేస్తాడు అనేది ఎవరికి స్పష్టత రావడం లేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే కొత్త దర్శకుడి తోనే సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి,

మరింత సమాచారం తెలుసుకోండి: