టాలీవుడ్ లో ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ కి హవా ఎక్కువగానే ఉంది. వాళ్లకు మంచి పాత్రలు ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. అగ్ర హీరోయిన్ లు గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు టాలీవుడ్ లో మంచి పాత్రలు వస్తే నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో నదియా, రమ్య కృష్ణ, స్నేహా, భూమిక హవా ఎక్కువగా నడుస్తుంది. వీళ్ళు అందరూ కూడా కీలక పాత్రలు చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ లో వీళ్ళు ఉంటే సినిమాలు హిట్ అవుతున్నాయి అనే భావనలో దర్శక నిర్మాతలు హీరోలు కూడా ఉండటం గమనార్హ౦. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు టాలీవుడ్ లో  భూమిక ఆఫర్లు కొట్టేస్తుంది. బాలకృష్ణ సినిమాలో ఆమె కు విలన్ పాత్ర కూడా వచ్చింది అనే వార్తలు వస్తున్నాయి. ఆ పాత్ర ఆమెకు బోయపాటి వివరించారు అని ఆమె అందుకు ఓకే చెప్పింది అని అంటున్నారు. ప్రస్తుతం భూమిక రెండు సినిమాల్లో చేస్తుంది. ఇక ఆమె కాస్త బోల్డ్ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపించింది అంటున్నారు. ఆమె ఒక కీలక పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. వేశ్య పాత్ర చేసే ఆలోచనలో ఆమె ఉందని అందుకు దర్శక నిర్మాతలు కూడా ఓకే చెప్పారట. 

 

ఆ పాత్ర మీద ఆమె ఎందుకు అంత దృష్టి పెట్టింది అనే విషయం స్పష్టంగా తెలియకపోయినా ఆ పాత్ర చేసిన వాళ్ళు అందరికి కూడా మంచి ఆఫర్లు తర్వాత వచ్చాయని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి అలాంటి పాత్రలే ఆమె చేస్తుందా లేక మరేదైనా అనేది అర్ధం కాలేదు గాని ఇప్పుడు ఆమెకు విలన్ లాంటి పెద్ద పాత్రలు వస్తున్న సమయంలో ఇలాంటి పాత్ర ఎంత వరకు భావ్య౦ అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఈ సినిమా చర్చలు కూడా పూర్తి అయినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: