తెలుగులో రీమేక్ చిత్రాల సందడి బాగా పెరిగింది. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలని తెలుగులో రీమేక్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయితే అన్ని రీమేక్ లు విజయం సాధించలేవు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేసిన చిత్రాలు సైతం బోల్తా కొడుతున్నాయి. ఇతర భాషల నుండి తెలుగులో రీమేక్ అవడమే కాదు, తెలుగు చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అవడం కూడా బాగా పెరిగింది.

 

ఒకప్పుడు రీమేక్ అంటే దక్షిణాది భాషల చిత్రాలతో పాటు హిందీ సినిమాలని కూడా రీమేక్ చేసేవారు. కానీ ప్రస్తుతం విదేశీ చిత్రాలను కూడా రీమేక్ చేస్తున్నారు. ముఖ్యంగా కొరియన్ సినిమాలపై దర్శకులకి ఆసక్తి బాగా పెరిగింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్ గా వచ్చిన ఓ బేబి చిత్రం కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్. ఓ బేబీ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే.

 

60 ఏళ్ళకి పైబడిన వృద్ధురాలు సడెన్ గా పాతికేళ్ల అమ్మాయిగా మారితే ఎలా ఉంటుందో చెప్పిన కథ ఇది. లేడీ ఓరియంటెడ్ గా సమంత చేసిన రెండవ చిత్రం ఇది. అంతకుముందు చేసిన యూటర్న్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ పెద్దగా వసూళ్ళు చేయలేదు. కానీ ఓ బేబీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా విజయం సమంతలో ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచింది. 

 


అందుకే మళ్ళీ నందిని దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతోంది. ఈ సారి కూడా కొరియన్ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఎమోషనల్ గా సాగే ఈ కథ సమంతకి బాగా సూటవుతుందట. ఇందులో నాగచైతన్య కూడా నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. లాక్డౌన్ పూర్తయిన వెంటనే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. నందినీ దర్శకత్వంలో వస్తున్న రెండవ కొరియన్ రీమేక్ ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: