ఆత్మాభిమానానికి చిరునామా నందమూరి తారక రామారావు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రోజు నుండి చనిపోయే వరకు తాను నమ్మిన విషయం కోసం ఎలాంటి పోరాటం చేయడానికైనా ఎన్టీఆర్ ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు. జీవితంలో రాజీపడటం అన్న విషయం తెలియని మహోన్నత వ్యక్తిగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ తన కొడుకు బాలకృష్ణ కోసం ఒక సందర్భంలో మహానటి భానుమతి సహాయం కోరాడు అన్న విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్య పోతారు.


ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న రోజులలో ఆయన వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఇంకా పాపులర్ హీరోగా అప్పట్లో సెటిల్ అవ్వకపోవడం ఎన్టీఆర్ ను అప్పట్లో తెగ కలవర పరిచేదట. దీనితో ముఖ్యమంత్రిగా తాను ఎంత బిజీగా ఉన్నా బాలయ్య ఒప్పుకునే సినిమా కథలు ఎన్టీఆర్ వినే వారట.


ఆ రోజులలో కోడి రామకృష్ణ భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై ఒక సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తూ ‘మావ్వాసనై’ అనే తమిళ సినిమాను తెలుగులో ‘మంగమ్మగారి మనవడు’ మూవీగా రీమేక్ చేయాలని ప్రయత్నించినప్పుడు ఎన్టీఆర్ ఆకథ విని ఆ మూవీలో బామ్మ పాత్రను భానుమతి చేసినప్పుడు మాత్రమే ఆ మూవీ హిట్ అవుతుందని అభిప్రాయపడి ఆ మూవీలో భానుమతిని ఫిక్స్ చేయమని చెప్పాడట. అయితే ఆ మూవీలో బామ్మ పాత్రను చేయడానికి తిరస్కరించడంతో స్వయంగా ఎన్టీఆర్ భానుమతికి ఫోన్ చేసి అడగడంతో ఆమె ఆ పాత్రను చేయడానికి అంగీకరించి బాలకృష్ణకు కొన్ని కండిషన్స్ పెట్టిందట.


భానుమతి షూటింగ్ స్పాట్ కు వచ్చే సమయంకంటే ముందుగా బాలయ్య షూటింగ్ స్పాట్ కు రావాలని తాను బాలయ్య కోసం ఒక్క నిముషం కూడ షూటింగ్ స్పాట్ లో వెయిట్ చేయను అని చెప్పిందట. అంతేకాదు తాను షూటింగ్ స్పాట్ లోకి రాగానే యూనిట్ సభ్యులతో పాటు బాలకృష్ణ కూడ లేచి నుంచుని తనకు అభివాదం తెలియచేయాలని చెపుతూ ఈ రెండు విషయాలలో ఎక్కడ తేడా వచ్చినా తాను షూటింగ్ స్పాట్ నుండి వెళ్ళి పోతానని చెప్పినప్పుడు బాలకృష్ణ నవ్వుతూ ఆమె కండిషన్స్ కు నవ్వుతూ ఆమెకు ప్రేమ కలిగే విధంగా ప్రవర్తించడంతో భానుమతి ఎంట్రీ ఇవ్వడం వల్ల ఆరోజులలో ‘మంగమ్మగారి మనవడు’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అని ఇప్పటికీ చెపుతూ ఉంటారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: