ఎన్నాళ్లని సోసో సినిమాలు చేసుకుంటూ ఉంటాం అని స్క్రీన్ మీద వాళ్లని వాళ్లే చూసుకుని బోర్ కొట్టినంట్టుంది. అందుకే ఈ సారి ఎక్స్ పెరిమెంట్లకి రెడీఅయ్యారు మన హీరోలు. 17 సంవత్సరాల కెరీర్ లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లు చేసిన బన్నీ.. ఫస్ట్ టైమ్ సరికొత్త లైన్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకూ కనిపించిన లుక్ కి డిఫరెంట్ గా అసలు ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చెయ్యని లుక్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. సుకుమార్ తో బన్నీ చేస్తున్న పుష్ప సినిమాలో రా లుక్ తో రియాలిటీకి దగ్గరగా ఉండే అప్పియరెన్స్ తో స్మగ్లర్ బ్యాక్ డ్రాప్ మూవీతో కనిపిస్తున్నాడు.

 

ఎప్పుడూ ఫైటింగులు, యుద్దాలు అంటూ హీరోల మీద పడి, శత్రువుల మీద పడి  యాక్షన్ చేసే రానా.. ఈ సారి సరికొత్తగా కనిపించబోతున్నాడు. కెరీర్ లో ఇప్పటివరకూ చాలా భారీ యాక్షన్ మూవీస్ చేసిన రానా  ఈసారి ప్రేమలో మునిగిపోతానంటున్నాడు. యాక్షన్ సినమాలు చేసి చేసి బోర్ కొట్టేసింది. అందుకే.. ఈ సారి ఫుల్ లెన్త్ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చెయ్యబోతున్నాను అని చెప్పాడు. అది తేజ  ఆల్రెడీ అనౌన్స్‌ చేసిన అలివేలుమంగ-వెంకటరమణ సినిమానే అయ్యి ఉంటుందని టాక్ నడుస్తోంది.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సరికొత్త ట్రాక్ లోకి వచ్చాడు. ఎప్పుడూ సేఫ్ సైడ్ సినిమాలు చేసిన పవన్ ..ఈ రీంట్రీ మూవీని డిఫరెంట్ గా సెలక్ట్ చేసుకున్నాడు. వకీల్ సాబ్ లో పెద్దగా డైమన్‌షన్స్ ఏం లేకపోయినా.. క్రిష్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న  జానపద బ్యాక్ డ్రాప్ మూవీలో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా రొటీన్ సినిమాలు చేస్తూనే వాటిలో చిన్న చిన్న ఎక్స్ పెరిమెంట్స్ చేస్తూ వచ్చాడు. రెట్రో సినిమాలు, రెట్రో గెటప్ లు పెద్దగా వెయ్యని ఎన్టీఆర్ ఈసారి కొమరం భీమ్ గా కనిపించబోతున్నాడు. రాజమౌళితో చేస్తున్న  ట్రిపుల్ ఆర్ సినిమాలో అగ్రెసివ్ సోషల్ యాక్టివిస్ట్ కొమరంభీమ్ క్యారెక్టర్ లో సరికొత్తగా కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: