హీరోయిన్ శ్రియ.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన ఈమెకు ప్రస్తుతం అంత క్రేజ్ లేకపోయినప్పటికీ అదే అందాన్ని మెయిన్టైన్ చేస్తూ వస్తోంది. ‘ఇష్టం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటి సంతోషం సినిమాతో ఓవర్నైట్ స్టార్డమ్ దక్కించుకుంది. ఇక ఆ తర్వాత బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, మహేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ మరియు రజనీకాంత్ ఇలా తెలుగు స్టార్ హీరోలందరి చెంతా ఆడిపడింది.
ఇక వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానులను మనసులను తనదైన అందచందాలతో దోచుకుంటుంది. అలాగే బాలీవుడ్లో దృశ్యం తో పాటు పలు సినిమాల్లో నటించిన శ్రియ.. 2018 మార్చిలో ప్రియుడు ఆండ్రీ కృశ్చేవ్ను వివాహం చేసుకుని సెటిల్ అయింది.
అలాగే గత యేడాది ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో సినిమాలో కాసేపు తళుక్కున ఈ బ్యూటి.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సరసన శ్రియ నటిస్తున్నారని తెలుస్తోంది. శ్రియ అజయ్ దేవగన్ జంటగా నటించడం ఇది రెండో సారి కావడం విశేషం.
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్కు బ్రేక్ పడింది. దీంతో సామాన్యలే కాకుండా సినీ తారాలు సైతం ఇంట్లో ఉంటున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో వారు చేసే ప్రతీ పనిని వీడియోలు, ఫోటోల రూపంలో షేర్ చేస్తూ తమ అభిమానులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ శ్రియ కూడా ఈ జాబితాలో చేరారు. ఎప్పటికప్పుడు తన కొత్త కొత్త ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇక వెండితెర ద్వారా తన అభిమానులను ఎంటర్టైన్ చేయలేకపోతోన్న శ్రియ సోషల్ మీడియా ద్వారా మాత్రం వారికి నయనానందాన్ని పంచతూ కేకపెట్టిస్తుంది. తాజాగా ఈ బ్యూటి హాట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలపై మీరు ఓ లుక్కేసేయండి.
శ్రియ హాట్ ఫోటోస్