టాలీవుడ్ లో టెంపర్ మూవీ తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న ఎన్టీఆర్ తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నారు.  ఆర్ఆర్ఆర్ టైటిల్ ఉగాది కానుకగా రివీల్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.  ‘రౌద్రం రణం రుధిరం’ మోషన్ పోస్టర్ దుమ్మురేపింది.  ఎన్టీఆర్, రామ్ చరణ్గ్రాఫిక్స్ మోషన్ పోస్టర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ఆ తర్వాత రామ్ చరణ్ పుట్టి రోజు కానుకగా అల్లూరి సీతారామరాజు కి సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు.  ఆ తర్వాత ఈ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపిస్తున్న అజయ్ దేవగాన్ పుట్టిన రోజు కానుకగా ఓ వీడియో రిలీజ్ చేయాలని చూశారు.. కానీ అప్పటికే కరోనా వైరస్ దేశం లో వ్యాపించడంతో లాక్ డౌన్ చేశారు.  

 

ఈ నేపథ్యంలో ఆ వీడియో చేయలేక పోయామని చిత్ర యూనిట్ అజయ్ దేవగాన్ కి సారీ చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఏలాంటి థ్రిల్ ఇవ్వబోతున్నారని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌. కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుతో ప్ర‌పంచం క‌త్తి ప‌ట్ట‌కుండా, గ‌న్ను పేల్చ‌కుండా నిర్భంద యుద్ధం చేస్తోంది. ఈ స‌మ‌యంలో లాక్ డౌన్ విధించ‌డంతో అంతా ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో కొంత మంది లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.

 

రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల క‌ల‌యిక‌లో రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. డీవీవీ దాన‌య్య అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జ‌న‌వరి 8న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.మే 20న ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కొమ‌రం భీం పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నాడ‌ట‌. 37 రోజులు వుండ‌టంతో ఎన్టీఆర్ లుక్ కొమ‌రం భీంగా ఎలా వుండ‌బోతోంది? జ‌క్క‌న్న ఎలా చూపించ‌బోతున్నాడ‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: