కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మొదటి సూత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం. ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న అప్పటినుంచి కరా చలనం దాదాపు అందరూ మానేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం దీని మీద చాలా పాటలు కొనసాగుతున్నాయి. "చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపరా కాలు కూడా  బయట పెట్టకురా" ప్రస్తుతం ఈ పాట మంచి ట్రెండింగ్ ఉంది.ఇలాంటివే అనేక మంది పాటలు కరోనా వైరస్ రూపొందించి ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. అయితే ఒక హీరో మాత్రం ఈ నిబంధనను కాస్త పక్కన పెట్టాడు అని అనిపిస్తుంది. దీనిపై తన అభిమానులు విరుచుకుపడుతున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీల ఇలాంటి తప్పులు చేస్తే సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని వారు అంటున్నారు.

 


ఇక అసలు విషయానికి వస్తే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో కరుణ వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఒక పోలీస్ కు చిరునవ్వుతో తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఇది చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున తనపై విమర్శలు గుప్పించారు. వరుణ్ ధావన్ మాస్కు కట్టుకోకుండా గ్లౌజ్ ధరించకుండా సామాజిక దూరం పాటించలేదని పైగా కొంచెం కూడా అసలు బుద్ధి లేకుండా పోలీసు అధికారికి షేకండ్ ఇస్తూ అతని ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టాడని అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

 


అలాగే మీరు ఇదే నా అభిమానులకు ఇచ్చే సందేశం అంటూ అతని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై స్పందించిన హీరో ఇడియట్ అది రెండు నెలల క్రితం దిగిన ఫోటో అని వారికి సమాధానం ఇచ్చారు. అయితే ప్రస్తుతం వరుణ్ ధావన్ "కూలి నెంబర్ వన్" సినిమాలో నటిస్తుండగా అతనితో హీరోయిన్ సారా అలీ ఖాన్ తన జోడీగా నటించనుంది. ఏది ఏమైనా భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం తీసుకుంటూ, మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: