బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ‘అంధాదున్' మూవీ తెలుగు లో రిమేక్ చేయబోతున్న సినిమాలో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ తదితరులు హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎన్, నికిత రెడ్డిలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం హిందీలో విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో నెగెటివ్ రోల్ చేసిన టబు పెర్ఫార్మెన్స్ కూడా కీలకమైనదే. ఈ బోల్డ్ క్యారెక్టర్ లో టబు నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు తెలుగు అంధాదున్ లో రమ్యకృష్ణ టబు చేసిన పాత్రలో కనిపించనుందట.

 

టాలీవుడ్ లో రమ్యకృష్ణ కు ఉన్న డిమాండ్ గురించి అందరికి తెలిసిందే. 'బాహుబలి' సినిమాలో దేవసేనగా సౌత్ లొనే కాకుండా దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ. ఈ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా, శైలజారెడ్డి అల్లుడు చిత్రాల్లో నటించింది. ఆమె ప్రస్తుతం బాషాభేదం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఒకప్పుడు రమ్యకృష్ణ స్టార్ కథానాయికగా ఉన్నప్పటి కంటే ఇప్పుడే ఆమెకు మరింత డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. పారితోషికం విషయంలో కూడా రమ్యకృష్ణ కి మంచి డిమాండ్ ఏర్పడింది.

 

ప్రతి సినిమా విజయంలో కీలకపాత్ర పోషిస్తున్న రమ్యకృష్ణ ఇప్పుడు మరో స్పెషల్ పాత్రలో కనిపించేందుకు భారీగా డిమాండ్ చేస్తోందట. అయితే డైలీ పేమెంట్ తీసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ఈ సీనియర్ బ్యూటీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదట. మొన్నటి కంటే ఇప్పుడు పాత్రను బట్టి రెమ్యునరేషన్ డోస్ పెంచిందట. ఆ రెమ్యునరేషన్ కొంత మంది స్టార్ హీరోయిన్స్ తీసుకునేదానికంటే చాలా ఎక్కువని తెలుస్తోంది. పాత్రల విషయంలో రమ్యకృష్ణ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తోంది. తనకి నచ్చకుంటే నచ్చలేదని మొహం మీదే చెప్పొస్తోందట. కానీ అందాదున్ లో టబు స్టైల్ ల్లో నటించాలి అంటే రమ్యకృష్ణ లాంటి హోమ్లీ నటికి ఇబ్బందే అని చెప్పాలి. కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించాలి అంటే ఆమె స్టార్ రేంజ్ ని పక్కనపెట్టాలి. లాక్ డౌన్ ఎత్తేసిన అనంతరం వీలైనంత త్వరగా సినిమాను స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: