లాక్ డౌన్ వల్ల గత నెల నుండి సినిమా ,సీరియల్ల షూటింగులు నిలిచిపోయాయి. విడుదలకావల్సిన సినిమాలు కూడా వాయిదాపడ్డాయి. అయితే ఈ లాక్ డౌన్ టైం ను వృధా చేసుకోకుండా పర్ఫెక్ట్ వాడుకుంటుంది ఆర్ఆర్ఆర్ ((రౌద్రం,రణం,రుధిరం) టీం. ఈ క్వారంటైన్ టైం లో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల పై ద్రుష్టి పెట్టారు. అందులో భాగంగా ప్రస్తుతం డబ్బింగ్ పనులు పూర్తి చేసున్నారట. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇంటి వద్ద నుండే తమ పాత్రలకు డబ్బింగ్ చెప్తున్నారట. ఎలాగైనా ఈ చిత్రాన్నివచ్చే ఏడాది జనవరి 8న  థియేటర్లోకి తీసుకరావాలనే పట్టుదల తో వుంది ఆర్ఆర్ఆర్ టీం. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ పూణే లో జరగనుంది. 
 
ఇక ఇటీవల విడుదలైన రామ్ చరణ్ పాత్ర తాలూకు టీజర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. త్వరలోనే ఈ సినిమా నుండి మరో సప్రైజ్ రానుంది. స్వాతంత్య సమరయోధులు కొమరంభీం ,అల్లూరి సీతారామరాజుల జీవిత చరిత్ర ఆధారంగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో దర్శక ధీరుడు  రాజమౌళి  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్ అల్లురి సీతారామరాజు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీం గా కనిపించనున్నాడు. వీరికి జోడిగా బాలీవుడ్ హీరోయిన్  అలియా భట్  హాలీవుడ్ నటి  ఒలీవియా మోరిస్ కనిపించనుంది. వీరిద్దరు  ఇప్పటివరకు షూటింగ్ లో జాయిన్ కాలేదు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో  కనిపించనున్నాడు.
 
400కోట్ల బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం తెలుగు తోపాటు కన్నడ , మలయాళ, తమిళ , హిందీ భాషల్లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: